ప్రముఖ సీనియర్ నటుడు దీక్షితులు కన్నుమూత

ప్రముఖ నటుడు, యాక్టింగ్ గురు డీఎస్ దీక్షితులు సోమవారం కన్నుమూశారు. ఓ సీరియస్ షూటింగ్‌లో పాల్గొన్న ఆయన ఆకస్మత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో సీరియల్ యూనిట్ వెంటనే నాచారంలోని ఓ ఆసుపత్రికి ఆయనను తరలించింది. అయితే మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా ప్రముఖ కమెడియన్, రైటర్ ఉత్తేజ్ బంధుమైన డీఎస్ దీక్షితులు పూర్తి పేరు దీవి శ్రీనివాస్ దీక్షితులు. 1956లో గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. మహేశ్ బాబు హీరోగా వచ్చిన మురారిలో […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:47 am, Tue, 19 February 19
ప్రముఖ సీనియర్ నటుడు దీక్షితులు కన్నుమూత

ప్రముఖ నటుడు, యాక్టింగ్ గురు డీఎస్ దీక్షితులు సోమవారం కన్నుమూశారు. ఓ సీరియస్ షూటింగ్‌లో పాల్గొన్న ఆయన ఆకస్మత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో సీరియల్ యూనిట్ వెంటనే నాచారంలోని ఓ ఆసుపత్రికి ఆయనను తరలించింది. అయితే మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు.

కాగా ప్రముఖ కమెడియన్, రైటర్ ఉత్తేజ్ బంధుమైన డీఎస్ దీక్షితులు పూర్తి పేరు దీవి శ్రీనివాస్ దీక్షితులు. 1956లో గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. మహేశ్ బాబు హీరోగా వచ్చిన మురారిలో పూజారి పాత్రలో దీక్షితులు నటించగా.. ఆ చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తరువాత ఇంద్ర, ఠాగూర్, అతడు, వర్షం వంటి పలు చిత్రాల్లో నటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్లమా పూర్తి చేసిన దీక్షితులు.. అక్కినేని యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్, రవీంద్ర భారతిలోని మీడియా సంస్థల్లో గురువుగా సేవలు అందించారు.