Katrina Kaif: కత్రినా పెళ్లికి ఎంతమంది వీఐపీలు వస్తున్నారంటే!.. వివరాలు వెల్లడించిన రాజస్థాన్‌ అధికారులు..

|

Dec 04, 2021 | 2:18 PM

గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతోన్న బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్- విక్కీ కౌశల్‌ మరికొన్ని రోజుల్లో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

Katrina Kaif: కత్రినా పెళ్లికి ఎంతమంది వీఐపీలు వస్తున్నారంటే!.. వివరాలు వెల్లడించిన రాజస్థాన్‌ అధికారులు..
Follow us on

గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతోన్న బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్- విక్కీ కౌశల్‌ మరికొన్ని రోజుల్లో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. రాజస్థాన్ ఓ విలాసవంతమైన ప్యాలెస్‌లో డిసెంబరు 9న వీరి వివాహం జరగనుందని బాలీవుడ్‌ జనాలు చెబుతున్నారు. ఆ రోజు సాయంత్రం హిందూ సాంప్రదాయం ప్రకారం కత్రినా- విక్కీల పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఇక ప్రి వెడ్డింగ్‌ కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్‌ 7న మెహందీ, 8న సంగీత్‌ వేడుకలు జరగనున్నాయట. అయితే బాలీవుడ్‌ అంతా ఈ పెళ్లి వేడుక గురించి చర్చిస్తున్నా.. కత్రినా కానీ, విక్కీ కానీ ఇప్పటివరకు ఒక్కమాట కూడా అధికారికంగా మాట్లాడలేదు. వీరి పెళ్లి గురించి రోజుకొక వార్త, రూమర్‌ బయటకు వస్తోంది. కాగా భారీ సంఖ్యలో అతిథులను ఆహ్వానించి పెద్ద ఎత్తున ఈ పెళ్లి వేడుకను జరపాలని కత్రినా, విక్కీల కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఒమిక్రాన్‌ నేపథ్యంలో ఆహ్వానితుల సంఖ్యను భారీగా తగ్గించారట.

కాగా కత్రినా, విక్కీల పెళ్లికి వచ్చే అతిథులకు సంబంధించి ఒక ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. రాజస్థాన్‌లోని ఓ స్టార్ హోటల్‌లో వీరు ఏడడుగులు నడవనున్న సంగతి తెలిసిందే. సవాయి మాధోపూర్‌ అనే ప్రాంతంలో ఉండే ‘సిక్స్ సెన్సెస్ ఫోర్ట్’ అనే విలాసవంతమైన హోటల్‌ వీరి వివాహానికి వేదిక కానుంది. కాగా అక్కడి జిల్లా కలెక్టర్ విక్కీ, కత్రీనా వివాహం గురించి స్పందించారు. ఆయన అందించిన సమాచారం ప్రకారం మొత్తం 120 మంది వీఐపీ అథితులు ఈ పెళ్లి వేడుకకు హాజరుకానున్నారట. వీరందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారేనట. ఒకవేళ అతిథుల్లో ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోని వారు ఉంటే ‘ఆర్‌టీపీసీఆర్’ టెస్ట్ చేయించుకున్న రిపోర్ట్‌ చూపించాలట. పెళ్లికి హాజరయ్యే ఏ ఒక్కరికీ కరోనా లక్షణాలు లేవని నిర్ధారించుకున్నాకే హోటల్‌లోకి అనుమతి ఇస్తున్నారని తెలిసింది.

Also read:

Mahesh Babu MEK: మహేష్‌, ఎన్టీఆర్‌ల సందడికి సమయం ఆసన్నమైంది.. ఎవరు మీలో కోటీశ్వరులు టెలికాస్ట్‌ అయ్యేది..

Taapsee Pannu : మిథాలీ థియేటర్లలోకి అడుగుపెట్టేది అప్పుడే..

RRR Movie: ఆ సన్నివేశంపై మరింత శ్రద్ద పెట్టి షూట్ చేసిన జక్కన్న.. ఫ్యాన్స్‌కు పూనకాలేనట..