మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’లో కీలక పాత్ర పోషించనున్న అనుష్క..?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. కరోనా విరామం తర్వాత తాజాగా...

  • Ravi Kiran
  • Publish Date - 2:16 pm, Sat, 21 November 20
మహేష్ బాబు 'సర్కారు వారి పాట'లో కీలక పాత్ర పోషించనున్న అనుష్క..?

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. కరోనా విరామం తర్వాత తాజాగా ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 11.43 నిమిషాలకు చిత్ర యూనిట్ కేపీహెచ్‌బీ కాలనీలోని కాశీ విశ్వనాథస్వామి ఆలయంలో లాంఛనంగా ప్రారంభించారు.

ఇక ఈ చిత్రం ఎక్కువ భాగంగా షూటింగ్ అమెరికాలో జరగనుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీకి థమన్ కొన్ని ట్యూన్స్ సిద్ధం చేశారట. అలాగే స్టార్ హీరోయిన్ అనుష్క ఓ కీలక పాత్రలో చేయనుందని తెలుస్తోంది. ఓ బ్యాంక్ ఆఫీసర్ పాత్రలో స్వీటీ కనిపించనుందని టాలీవుడ్ టాక్. ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయంలో నటిస్తున్నట్లు సమాచారం.

అలాగే అనిల్ కపూర్ విలన్‌గా, విద్యా బాలన్ మహేష్ సోదరిగా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంత..? ఈ మూవీలో ఎవరెవరు నటించబోతున్నారు..? లాంటి ప్రశ్నలకు అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌, మహేష్ బాబు సంయుక్తంగా  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.