RRR: రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో, ఎన్టీర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఈ చిత్రం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. కరోనా (Corona) కారణంగా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి. దేశంలోని దాదాపు అన్ని భాషలతోపాటు, ఇతర దేశాల్లోనూ విడుదలవుతుండడంతో ఓవర్‌సీస్‌లోనూ ఆర్‌ఆర్‌ఆర్ మార్కెట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని అమెరికాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాలో ఆర్ఆర్‌ఆర్ సినిమాను విడుదల చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ సరిగమ సినిమాస్ తాజాగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదలకు సంబంధించి ట్వీట్ చేస్తూ..’అమెరికాలో ఉన్న ఆడియన్స్ సిద్ధంగా ఉండండి. రేపు (ఆదివారం) మీకోసం సరిగమ సినిమాస్, రాఫ్తార్ క్రియేషన్స్ నుంచి ఎగ్జైట్‌మెంట్ ప్రకటన రానుంది. ఇది ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా అందుకోలేని అరుదైన విశేషం’ అంటూ రాసుకొచ్చారు. దీంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆసక్తి నెలకొంది. అమెరికాలో ఏ భారతీయ సినిమా సాధించని ఆ ఘనత ఏంటా అన్ని ఆలోచిస్తున్నారు. ఇంతకీ ఆ ఎగ్జైట్‌మెంట్ ఏంటో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.
ATTENTION USA?? AUDIENCE
EXCITING Announcement coming your way tomorrow from Sarigama Cinemas & Raftar Creations??
This is something which has been never achieved by any INDIAN FILM ever !!#RRRMovie #RRRinUSA @RaftarCreations
— Sarigama Cinemas (@sarigamacinemas) March 12, 2022
ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను అంతే భారీగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఆలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సముద్రఖని, శ్రియా, అజయ్ దేవ్ గన్ ఇతర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
Also Read: DRDO Recruitment: డీఆర్‌డీవీలో అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తులకు గడువు ఇంకా రెండు రోజులే..
Russia – Ukraine War: ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన పాకిస్తాన్ యువతి.. ఎందుకోసమంటే..!
బాలీవుడ్‌లో కుక్కలను ఇష్టపడే తారలు వీరే..