
అయితే, పెళ్లిలో వధూవరుల కంటే ఎక్కువగా సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ తన రాయల్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఆమె ధరించిన నెక్లెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముంబైలోని ఒక విలాసవంతమైన హోటల్ తారల మెరుపులతో నిండిపోయింది. అర్జున్ టెండూల్కర్ పెళ్లి వేడుకలో ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో మెరిసిపోతున్నారు. కానీ, గులాబీ రంగు చీరలో దేవకన్యలా నడుచుకుంటూ వస్తున్న సారా టెండూల్కర్ కనిపించగానే అందరి కళ్లు ఆమెపైనే నిలిచిపోయాయి. ఆమె కట్టుకున్న చీర ఒక ఎత్తైతే, ఆమె మెడలో ఉన్న ఆ పురాతన కళాకృతి (నెక్లెస్) మరొక ఎత్తు. దాని విలువ తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం జీవితాంతం సంపాదించే సొమ్ము ఆ ఒక్క నెక్లెస్ విలువతో సమానం. ఆ ఖరీదైన ఆభరణం విశేషాలేంటో తెలుసుకుందాం..
సారా టెండూల్కర్ ఈ వేడుక కోసం జైపూర్‌కు చెందిన ప్రముఖ డిజైనర్ సునీత షెకావత్ రూపొందించిన ‘కార్నేషన్ రివర్సిబుల్ నెక్లెస్’ను ధరించింది. జ్యువెలరీ నిపుణుడు ప్రియాంషు గోయల్ ప్రకారం, ఈ నెక్లెస్ విలువ దాదాపు రూ. 40 లక్షల నుండి రూ. 60 లక్షల వరకు ఉంటుందని అంచనా. దీనిని తయారు చేయడానికి నిపుణులైన కళాకారులు సుమారు 360 గంటల పాటు శ్రమించారట.
ఇందులో అత్యుత్తమమైన కుందన్ పొల్కీలు, కొలంబియన్ ఎమరాల్డ్స్ (పచ్చలు) మరియు సౌత్ సీ పర్ల్స్ (ముత్యాలు) ఉపయోగించారు. ఈ నెక్లెస్ ప్రత్యేకత ఏంటంటే, దీనిని రెండు వైపులా ధరించవచ్చు. ముందు భాగంలో సాంప్రదాయ కుందన్ సెట్ ఉండగా, వెనుక భాగంలో అద్భుతమైన మీనాకారి పనితనం ఉంటుంది. సారా ఎంచుకున్న సాఫ్ట్ ఎమరాల్డ్ డ్రాప్స్ ఆమె హుందాతనాన్ని మరింత రెట్టింపు చేశాయి. సాంప్రదాయానికి, ఆధునికతకు ఇది ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.
నగలకు తగ్గట్టుగానే సారా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన రోజ్-పింక్ చీరను ధరించింది. దీనికి జతగా హెమ్ లైన్ వద్ద డ్రాప్స్ ఉన్న బ్లౌజ్ ఆమె లుక్‌కు సరికొత్త గ్లామర్‌ను తెచ్చిపెట్టింది. సింపుల్ మేకప్, వింగ్డ్ ఐ లైనర్, మధ్యలో పాపిడి తీసిన హెయిర్ స్టైల్ మరియు మెహందీ నిండిన చేతులకు గాజులు ధరించి సారా ఒక కంప్లీట్ వెడ్డింగ్ లుక్‌లో మెరిసిపోయింది. అర్జున్ టెండూల్కర్ పెళ్లి వేడుకలో సారా టెండూల్కర్ ధరించిన ఈ ఆభరణం కేవలం ఒక నగ మాత్రమే కాదు, అది భారతీయ హస్తకళకు నిదర్శనం. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా సారా రాయల్ లుక్ గురించే చర్చ జరుగుతోంది.