ఓ వైపు ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తూనే.. మరోవైపు సినిమా కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది అక్కినేని కోడలు సమంత. ప్రస్తుతం ఈ భామ ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌లో నెగిటివ్ పాత్రలో నటిస్తోంది. అలాగే చైతుతో కలిసి మరో చిత్రంలో సమంత కనిపించబోతున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్ కోసం వెళ్లిన సమంత అక్కడ చీర కట్టులో మెరిసింది. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది సమంత. అందులో ఓ ఫొటోలో తన నడుము పైభాగంలో ఉన్న టాటూను బయటపెట్టేసింది సమంత. ఇది వరకే ఓ ఫొటో షూట్‌లో ఆ టాటూ కాస్త కనిపించగా.. ఇప్పుడు మొత్తాన్ని బయటపెట్టేసింది. అయితే ఆ టాటూ తన భర్త నాగ చైతన్య సంతకం కావడం విశేషం. తన భర్తపై ప్రేమతో అతడి సంతకాన్ని ఆమె నడుముకు పైభాగంలో వేయించుకోవడం గమనర్హం. కాగా ఈ అవార్డు వేడుకలో సూపర్ డీలక్స్ సినిమాకు గానూ ఆమెకు బెస్ట్ జ్యూరీ అవార్డు లభించింది.