Salman Khan: ఫ్లాప్‌ సెంటిమెంట్‌ రిపీట్ చేయడమేంటి బాయ్‌? మళ్లీ అదే తప్పు చేస్తున్నారా..?

| Edited By: Janardhan Veluru

Mar 19, 2025 | 6:43 PM

సల్మాన్ ఖాన్ తన సినిమాలను ఆదివారం రిలీజ్ చేయడం ద్వారా బాలీవుడ్ సెంటిమెంట్స్‌ను అతిక్రమిస్తున్నారు. టైగర్ 3 ఆదివారం రిలీజ్ అవడం వల్ల వసూళ్లు తగ్గాయన్న టాక్ వినిపించింది. అయినా తగ్గడం లేదు. ఇప్పుడు "కిసీ కా భాయ్ కిసీ కి జాన్" సినిమాను కూడా ఆదివారమే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ నిర్ణయం బాక్స్ ఆఫీస్ వసూళ్లను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.

Salman Khan: ఫ్లాప్‌ సెంటిమెంట్‌ రిపీట్ చేయడమేంటి బాయ్‌? మళ్లీ అదే తప్పు చేస్తున్నారా..?
Salman Khan
Follow us on

ఫిలిం ఇండస్ట్రీలో సెంటిమెంట్స్‌ ను గట్టిగా నమ్ముతారు. ఎంత నాస్తికుడైనా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు కొన్ని సెంటిమెంట్స్‌ ను ఖచ్చితంగా ఫాలో అవుతారు. ముఖ్యంగా సినిమా కాంబినేషన్స్‌, రిలీజ్ విషయంలో ఈ సెంటిమెంట్స్‌ ను మరింత గట్టిగా ఫాలో అవుతారు. కానీ బాలీవుడ్ భాయ్‌ జాన్‌ సల్మాన్‌ ఖాన్ మాత్రం ఈ రూల్‌ ను బ్రేక్ చేస్తున్నారు. తన ప్రీవియస్ సినిమా విషమంలో అస్సలు వర్కవుట్ కాని ఓ ఫార్ములాను నెక్ట్స్ మూవీ విషయంలోనూ రిపీట్ చేస్తున్నారు.

2023లో టైగర్ 3 సినిమాతో ఆడియన్స్‌ ముందుకు వచ్చారు సల్మాన్‌ ఖాన్‌. టైగర్ సిరీస్‌ లో థర్డ్ ఇన్‌ స్టాల్మెంట్‌ గా వచ్చిన టైగర్‌ 3 అనుకున్న రేంజ్‌ లో పర్ఫామ్ చేయలేదు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. పఠాన్‌ గా షారూఖ్ గెస్ట్ అపియరెన్స్‌ కూడా సినిమాను సేవ్ చేయలేకపోయింది. అయితే టైగర్ 3 విషయంలో మెయిన్ ప్రాబ్లమ్ రిలీజ్‌ డేట్‌.

2023 నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది టైగర్ 3. ఇండియన్ ఇండస్ట్రీ లో ఏ సినిమా అయిన శుక్రవారం రిలీజ్ చేయటం అన్నది సాంప్రధాయంగా వస్తోంది. ఫెస్టివల్ సీజన్ అయితే ఒకటి రెండు రోజులు ముందైనా విడుదల చేస్తారు గానీ, ఆలస్యం మాత్రం చేయరు. కానీ టైగర్‌ 3 విషయంలో ఈ రూల్‌ను పక్కన పెట్టి ఆదివారం సినిమా రిలీజ్ చేశారు భాయ్‌ జాన్‌. దీంతో తొలి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చినా… డే 2 నుంచి వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఆ ఎఫెక్ట్ ఫైనల్ కలెక్షన్స్ మీద కూడా స్పష్టంగా కనిపించింది.

టైగర్ 3 విషయంలో ఫెయిల్ అయినా… మరోసారి ఆదివారం సినిమా రిలీజ్‌ కు రెడీ అవుతున్నారు భాయ్‌ జాన్‌. ఈద్‌ కానుకగా రిలీజ్ అని ప్రకటించిన సికందర్ సినిమాను మార్చి 30 ఆదివారం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో సల్మాన్ ఫ్యాన్స్‌ లో టెన్షన్ మొదలైంది. అసలే ఎగ్జామ్స్ సీజన్ కావటంతో వసూళ్ల మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది. దీనికి తోడు సండే రిలీజ్ అంటే మరింత ప్రభావం పడే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. అయితే ఇటీవల కాలంగా అన్‌ సీజన్‌ లో వచ్చిన సినిమాలు కూడా సంచలనాలు నమోదు చేస్తుండటంతో సికందర్ విషయంలో అదే మ్యాజిక్ జరుగుతుందని నమ్ముతున్నారు. మరి సల్మాన్‌ నమ్మకమే నిజమవుతుందా..? లేక మరోసారి సండే రిలీజ్ ఫార్ములా బెడసి కొడుతుందా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.