AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరాడంబరంగా స‌ల్మాన్ ఖాన్ పుట్టిన రోజు వేడుకలు.. ఇలా చేయడానికి కారణం ఏంటో తెలుసా?

బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ తన 55వ పుట్టిన రోజు వేడుకలను చాలా నిరాడంబరంగా జరుపుకున్నాడు. ప‌న్వెల్ ఫాం హౌజ్‌లో కొద్ది మంది

నిరాడంబరంగా స‌ల్మాన్ ఖాన్ పుట్టిన రోజు వేడుకలు.. ఇలా చేయడానికి కారణం ఏంటో తెలుసా?
uppula Raju
|

Updated on: Dec 27, 2020 | 11:54 AM

Share

బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ తన 55వ పుట్టిన రోజు వేడుకలను చాలా నిరాడంబరంగా జరుపుకున్నాడు. ప‌న్వెల్ ఫాం హౌజ్‌లో కొద్ది మంది శ్రేయోభిలాషుల మ‌ధ్య కేక్ క‌ట్ చేసి బ‌ర్త్‌డే జ‌రుపుకున్నాడు. వాటికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ బిగ్‌బాస్‌ 14 సీజన్‌ షో నిర్వహిస్తున్నాడు. అలానే ‘అంథిమ్‌: ది ఫైనల్ ట్రూత్‌’ చిత్రీకరణలో ఉన్నారు.

అయితే ప్రతి సంవత్సరం సల్మాన్ ఖాన్ తన బర్త్‌డే వేడుకలను వేల సంఖ్యలో అభిమానుల మధ్య జరుపుకునేవాడు. ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి చాలామంది అభిమానులు సల్లూ ఇంటికి వచ్చేవారు. సల్మాన్ ఖాన్ కూడా అభిమానులను కలిసి ఫోటోలు దిగేవారు. అయితే ఈ ఏడాది కరోనా వల్ల మారిన పరిస్థితుల నేపథ్యంలో తన ఇంటికి ఎవరూ రావద్దంటూ సల్మాన్ ఖాన్ అభిమానులకు ఆంక్షలు విధించారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులను కీలక సూచనలు చేశారు. కరోనా ఉధృతి నేపథ్యంలో అభిమానులు తన ఇంటి దగ్గరకు వచ్చి గుమికూడవద్దని సూచించారు.

ఇదిలా ఉంటే తన చెల్లెలు అర్పిత, తన భర్త ఆయుష్‌ శర్మలు సల్మాన్‌ పుట్టినరోజుకు ఇ‍వ్వబోయే గిఫ్ట్‌ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటికే నిండు గర్భవతైన అర్పితా, సల్మాన్‌ బర్త్‌డే రోజునే తన రెండో సంతానానికి జన్మనివ్వనుంది. దీంతో సల్మాన్‌ ఖాన్‌ ఖాందన్‌ లో ఇప్పటికే డబుల్‌ సెలెబ్రెషన్స్‌ ప్రారంభమయ్యాయి. ఇక సల్మాన్‌ ఖాన్‌ ఈ ఏడాది నుంచి తన పుట్టినరోజును స్పెషల్‌ పర్సన్‌తో షేర్‌ చేసుకోబోతున్నాడన్నమాట.

Follow Us
టీమిండియా తరపున ఆడే ఛాన్స్ దక్కని నలుగురు తోపులు..!
టీమిండియా తరపున ఆడే ఛాన్స్ దక్కని నలుగురు తోపులు..!
కర్మ అంటే ఏంటీ..? మంచికి మంచి.. చెడుకి చెడు నిజంగా జరుగుతుందా..!
కర్మ అంటే ఏంటీ..? మంచికి మంచి.. చెడుకి చెడు నిజంగా జరుగుతుందా..!
డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు
డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!