Vakeel Saab Teaser: పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.! ‘వకీల్ సాబ్’ టీజర్ రెడీ.? డేట్ ఎప్పుడంటే.!!
Vakeel Saab Teaser: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన చిత్రం 'వకీల్ సాబ్'. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ..
Vakeel Saab Teaser: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన చిత్రం ‘వకీల్ సాబ్’. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మూవీపై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘వకీల్ సాబ్’ టీజర్ సిద్ధమైందని.. జనవరి 1న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందంటూ నెట్టింట్లో వార్త హాల్‌చల్ చేస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా, ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అటు గత కొద్దిరోజులుగా ఈ సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా బయటికి రాకపోవడంతో పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. 2020లో ట్విట్టర్‌లో ‘వకీల్ సాబ్’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయిన దాని బట్టే సినిమా టీజర్ కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో అర్ధమైపోతుంది.