Sai Pallavi: ‘గత జన్మలో నేను తెలంగాణలో పుట్టుంటా’… ఆసక్తికర విషయాలు పంచుకున్న సాయి పల్లవి..

|

Jun 14, 2022 | 8:12 PM

Sai Pallavi: ఇప్పుడు టాలీవుడ్‌లో అందరి దృష్టి 'విరాట పర్వం' (Virata Parvam) సినిమాపైనే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా..

Sai Pallavi: గత జన్మలో నేను తెలంగాణలో పుట్టుంటా... ఆసక్తికర విషయాలు పంచుకున్న సాయి పల్లవి..
Follow us on

Sai Pallavi: ఇప్పుడు టాలీవుడ్‌లో అందరి దృష్టి ‘విరాట పర్వం’ (Virata Parvam) సినిమాపైనే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన ఈ సినమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సురేష్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాణ బాధ్యతలు తీసుకోవడం, నీది నాది ఒకే కథ సినిమాతో ప్రేక్షకులకు ఆలోజింపచేసిన వేణు దర్శకత్వం వహించడంతో సినిమాపై అందరిలోనూ క్యూరియాసిటీ పెరిగిపోయింది. నక్సలిజం నేపథ్యంలో నిజ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కడం కూడా ఈ సినిమాకు పాజిటివ్‌ బజ్‌ను తెచ్చింది. జూన్‌17న సినిమాను విడుదల చేయనున్న చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే జూన్‌ 15న ప్రీరిలీజ్‌ ఈవెంట్ నిర్వహిస్తోంది.

ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ సైతం వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా ప్రచారంలో భాగమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మిమ్మల్ని చాలా మంది తెలంగాణ ఆడపుడుచు అంటున్నారు కదా.. దీనిపై ఎలా స్పందిస్తారన్న’ ప్రశ్నకు బదులిస్తూ.. ‘అవును చాలా మంది అలాగే అంటున్నారు. దర్శకుడు వేణు గారు కూడా ఇదే మాట అన్నారు. బహుశా నేను గత జన్మలో ఇక్కడే పుట్టి ఉంటాను’ అంటూ నవ్వుతూ బదులిచ్చింది సాయి పల్లవి. ఇక రానా నుంచి ఏం నేర్చుకున్నారన్న దానికి బదులిస్తూ.. ‘ఒక కథ అనుకున్నాక ఇంతే చేయొచ్చని అనుకునేదాన్ని. కానీ ఒక కథ స్థాయిని పెంచడం రానా గారు నేర్పించారు. ఆయన కథల ఎంపిక కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చింది.

ఇక నక్సలిజం తన అభిప్రాయం గురించి చెప్పుకొచ్చిన సాయి పల్లవి.. ‘దీన్ని ఒక పాత్ర గానే చేశాను. ఒకదానిపై అభిప్రాయం చెప్పాలంటే మనం ఆ కాలంలో ఉండాలి. ఒక సమూహం ఎందుకు ఒక ఉద్యమంలో భాగమవ్వాలని అనుకున్నారనే విషయాలు గురించి సినిమా చేస్తున్న క్రమంలో తెలుసుకున్నాను. ఇది నా వరకూ ఒక లెర్నింగ్ ప్రాసెస్ మాత్రమే’ అంటూ బదులిచ్చిందీ హైబ్రిడ్‌ పిల్ల. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..