AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh bellamkonda: బెల్లం కొండ ఫ్యామిలీ మరో హీరో సినిమా వచ్చేస్తోంది.. విడుదల తేదీ ఎప్పుడంటే..

Ganesh bellamkonda: ప్రముఖ నిర్మాత బెల్లం కొండు సురేశ్‌ రెండో తనయుడు, హీరో బెల్లం కొండ శ్రీనివాస్‌ సోదరుడు బెల్లం కొండ గణేశ్‌ హీరోగా వెండి తెర ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే...

Ganesh bellamkonda: బెల్లం కొండ ఫ్యామిలీ మరో హీరో సినిమా వచ్చేస్తోంది.. విడుదల తేదీ ఎప్పుడంటే..
Narender Vaitla
|

Updated on: Jun 14, 2022 | 5:59 PM

Share

Ganesh bellamkonda: ప్రముఖ నిర్మాత బెల్లం కొండు సురేశ్‌ రెండో తనయుడు, హీరో బెల్లం కొండ శ్రీనివాస్‌ సోదరుడు బెల్లం కొండ గణేశ్‌ హీరోగా వెండి తెర ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. ‘స్వాతిముత్యం’ అనే క్లాసిక్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో గణేశ్‌కు జంటగా వర్ష బొల్లమ్మ నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత సూర్య దేవర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంతో కె. కృష్ణ అనే నూతన దర్శకుడు ఎండస్ట్రీకి పరిచయమవుతున్నాడు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, ఫస్ట్‌గ్లింప్స్‌ చిత్రంపై పాజిటివ్‌ బజ్‌ను తీసుకొచ్చాయి. లవ్‌, ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా తేదీని తాజాగా చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 13న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన సందర్భంగా చిత్ర యూనిట్‌ మీడియతో ముచ్చటించారు. ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ‘స్వాతిముత్యం సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. స్వాతిముత్యం లాంటి ఓ యువకుడి కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నదే ఈ చిత్ర కథాంశం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ సినిమాలో సీనియర్‌ నటుడు నరేష్‌, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ లల్‌ ఎంటర్‌టైనర్‌కు మహతి స్వర సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. మరి బెల్లం కొండ ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇస్తోన్న ఈ మరో యంగ్ హీరో ఏ మేర సక్సెస్‌ అవుతాడో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్