
Sai Pallavi: మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి ఇంట్రస్టింగ్ విషయాన్ని రిలీవ్ చేశారు. రీసెంట్‌గా విరాటపర్వం సినిమాతో మరోసారి తను లేడీ పవర్ స్టార్ అని ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు యాక్షన్ సినిమాల వైపు చేస్తున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో అదే విషయాన్ని బయటపెట్టారు.
హీరోయిన్‌కు నటిగా ఎంత మంచి పేరున్నా… సొంత ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ రావాలంటే మాత్రం యాక్షన్ సినిమా చేయాల్సిందే. విజయశాంతి నుంచి అనుష్క వరకు యాక్షన్ జానర్‌లోకి ఎంట్రీ ఇచ్చాకే లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌ను సాధించగలిగారు. అందుకే సాయి పల్లవి కూడా ఇప్పుడు అదే జానర్ మీద దృష్టి పెట్టారు.
నటిగా విలక్షణ పాత్రల్లో మెప్పిస్తున్న సాయి పల్లవి.. యాక్షన్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట. హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ కిల్ బిల్ తరహా కథ ఎవరైన చెప్తే అలాంటి సినిమా చేస్తానంటు తన మనసులో మాట బయట పెట్టారు ఈ బ్యూటీ.
రీసెంట్‌గా బాలీవుడ్ క్వీన్ కంగన కూడా ఇలాంటి కాన్సెప్ట్‌తోనే ఓ సినిమాను చేశారు. కిల్ బిల్ ఇన్స్‌పిరేషన్‌తో ధాకడ్ మూవీని తెరకెక్కించారు. అయితే ఈ కాన్సెప్ట్ ఇండియన్ ఆడియన్స్‌కు పెద్దగా కనెక్ట్ కాకపోవటంతో అంతగా మెప్పించలేకపోయింది. ధాకడ్ బాక్సాఫీస్ ముందు దారుణంగా ఫెయిల్ అయ్యింది
ధాకడ్ రిజల్ట్ చూశాక కూడా సాయిపల్లవి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే.. యాక్షన్ జానర్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని ఈ భామ ఎంత స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యారో అర్ధమవుతుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఆల్రెడీ అనుకోని అతిథి సినిమాలో యాక్షన్ యాంగిల్ చూపించిన సాయి పల్లవి ఇప్పుడు ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి సాయి పల్లవి కోసం మన దర్శకులు అలాంటి కథను రెడీ చేస్తారేమో చూడాలి.
మరిన్ని సినిమా వార్తలు చదవండి