RRR Twitter Review: బాక్సులు బద్దలవుతున్నాయి.. ఊహించని ట్విస్టులు ఎన్నో.. ఆర్‌ఆర్‌ఆర్‌ ట్విట్టర్‌ రివ్యూ.

| Edited By: Ravi Kiran

Mar 25, 2022 | 10:00 AM

RRR Movie: సినిమా అభిమానుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఎట్టకేలకు వచ్చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి విజన్‌, రామ్‌ చరణ్‌ (Ramcharan), ఎన్టీఆర్‌ (NTR) కృషి ఫలితానికి ఈ రోజు ప్రతిఫలం దక్కనుంది. ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేందుకు...

RRR Twitter Review: బాక్సులు బద్దలవుతున్నాయి.. ఊహించని ట్విస్టులు ఎన్నో.. ఆర్‌ఆర్‌ఆర్‌ ట్విట్టర్‌ రివ్యూ.
Rrr Twitter Review
Follow us on

RRR Twitter Review: సినిమా అభిమానుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఎట్టకేలకు వచ్చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి విజన్‌, రామ్‌ చరణ్‌ (Ramcharan), ఎన్టీఆర్‌ (NTR) కృషి ఫలితానికి ఈ రోజు ప్రతిఫలం దక్కనుంది. ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రేక్షకులకు ముందుకు వచ్చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచంలో భారతీయులు ఉన్న చోట్లలో ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా నడుస్తోంది. ఇప్పటికే బెన్‌ఫిట్‌ షోలు, ప్రీమియర్‌ ఫోలు మొదలయ్యాయి. సినిమా చూస్తున్న అభిమానులు అప్పుడే ట్విట్టర్‌ వేదికగా ఆర్‌ఆర్‌ఆర్‌ రివ్యూను చెప్పేస్తున్నారు. సినిమా ఎలా ఉందన్న వివరాలను ట్విట్వర్‌ వేదికగా పంచుకుంటున్నారు. థియేటర్లలో బాక్సులు అవుతున్నాయని, సినిమాలో ఊహించని ట్విస్టులు ఎన్నో ఉన్నాయంటూ ట్వీట్లు చేస్తున్నారు..

ఓ అభిమాని అయితే సినిమాకు ఏకంగా 4.5 రేటింగ్ ఇచ్చేశాడు. వరల్డ్‌ బిగ్గెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌.. సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉంది. యాక్షన్‌ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. సినిమా మొదటి నుంచి చివరి వరకు అద్భుతంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు.

ఇక మరో నెటిజన్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘ఫస్ట్‌ హాఫ్‌ నిడివి 1 గంట 40 నిమిషాలు ఉందని తెలిసిన తర్వాత సినిమా ఎక్కడ బోర్‌ కొడుతుందో అని భయపడ్డాను. కానీ సినిమా అద్భుతంగా ఉంది. చిత్ర యూనిట్ పడ్డ కష్టం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అద్భుతంగా నటించారు అంటూ రాసుకొచ్చాడు.

ఇది మంచి డ్రామాతో కూడిన మాస్‌ సినిమా అంటూ మరో ఫ్యాన్‌ ట్వీట్ చేశాడు. రాజమౌళి మరోసారి తన మ్యాజిక్‌ను చూపించారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల నటన అద్భుతంగా ఉంది. బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అద్భుతం, ఇంటర్వెల్‌ బ్లాక్‌ బ్రియిలంట్‌ అంటూ ట్వీట్ చేశాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా గురించి ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతోన్న మరికొన్ని ట్వీట్స్‌..

 

Also Read: Boat Airdopes 411: బోట్‌ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. తక్కువ ధరల్లోనే లభ్యం

Chandra Babu: రాజధానిపై మళ్లీ మూడుముక్కలాట.. పాలించే అర్హత లేదు.. రాజీనామా చేసి రండి..