RRR Movie: జనవరి 7 ఎప్పుడెప్పుడు వస్తుందా అని మూవీ లవర్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం ఆ రోజు ఆర్.ఆర్.ఆర్ సినిమా విడుదలవుతుండడమే. అత్యంత భారీ బడ్జెట్‌తో, అంతకుమించిన అంచనాల నడుమ విడుదలవుతోందీ సినిమా. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై ఎక్కడ లేని అంచనాలు ఉన్నాయి. ఇక కేవలం ఇండియాకే పరిమితం కాకుండా అమెరికాలోనూ ఆర్.ఆర్.ఆర్ సంచలనం సృష్టిస్తోంది. సినిమా విడుదల కంటే ముందే ఆర్.ఆర్.ఆర్ రికార్డులను తిరగరాయడం ప్రారంభించింది. ప్రీ బుకింగ్స్‌తో అమెరికాలో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోందీ చిత్రం. ఇప్పటి వరకు ప్రీసేల్స్ ఏకంగా 9 లక్షల మార్కు రికార్డుని బ్రేక్ చేసింది.
ఈ నేపథ్యంలో అమెరికాలోని సీని మార్క్‌లో 5 లక్షల డార్లు, రీగల్‌లో లక్షన్నర డాలర్లు, ఇమాజిన్‌లో 3 లక్షల డాలర్ల వసూళ్లను సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకుందీ సినిమా. అడ్వాన్స్ బుకింగ్స్‌లో అమెరికాలో ఇది సరికొత్త రికార్డు. సినిమా విడుదలకు ఇంకా 15 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక అమెరికాలోనే పరిస్థితి ఇలా ఉంటే మరి భారత్‌లో ఆర్.ఆర్.ఆర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి బాహుబలి ఇండియన్ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకుపోయిన రాజమౌళి.. ఆర్‌ఆర్‌ఆర్‌తో ఇంకెన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరిగా కనిపించనున్నాడు.
Also Read: UP Elections 2022: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో అపశృతి.. కూప్పకూలిన కిసాన్ దివస్ వేదిక..!
Hit.Movie: తెలుగు ఎన్ఆర్ఐ ఓటీటీ ప్లాట్‌ఫారమ్.. సబ్‌స్క్రిప్షన్ లేకుండా సినిమాలు చూడొచ్చటా..!