RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి బిగ్‌అప్‌డేట్‌, విడుదల తేదీ కాన్ఫామ్‌.. ఎప్పుడు రానుందంటే..

|

Jan 31, 2022 | 6:01 PM

RRR Movie: ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాకుండా యావత్‌ ఇండియన్‌ ఫిలిమ్ ఇండస్ట్రీ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. రాజమౌళిలాంటి అపజయం ఎరుగని దర్శకుడు డైరెక్షన్‌ వహిస్తుండడం...

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి బిగ్‌అప్‌డేట్‌, విడుదల తేదీ కాన్ఫామ్‌.. ఎప్పుడు రానుందంటే..
Follow us on

RRR Movie: ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాకుండా యావత్‌ ఇండియన్‌ ఫిలిమ్ ఇండస్ట్రీ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. రాజమౌళిలాంటి అపజయం ఎరుగని దర్శకుడు డైరెక్షన్‌ వహిస్తుండడం, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ లాంటి బడా స్టార్‌లు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడలేని క్రేజ్‌ వచ్చేసింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆర్‌ఆర్‌ఆర్‌కు బ్రేక్‌ పడుతూ వస్తోంది. జనవరిలో చిత్ర విడుదల కాన్ఫామ్‌ అనుకుంటున్న సమయంలోనే కరోనా థార్డ్‌ వేవ్‌ రూపంలో మరోసారి బ్రేక్‌ పడింది.

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరగడంతో చిత్ర యూనిట్‌ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తర్వాత కొన్ని రోజులకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను మార్చి 18 లేదా ఏప్రిల్‌ 28న విడుదల చేస్తామని ప్రకటించింది కానీ తాజాగా ఈ రెండు రోజులు కాకుండా సినిమాను మార్చి 25న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

ఎలాంటి చడీచప్పుడు లేకుండా చిత్ర యూనిట్‌ సినిమా తేదీని ట్విట్టర్‌ వేదికగా ప్రకటించేసింది. దీంతో ఇన్ని రోజులు నుంచి సినిమాకోసం ఎదురు చూస్తోన్న ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆంక్షలు ఎత్తి వేస్తుండడం, విడుదలకు మరో 25 రోజులు ఉండడంతో అప్పటికి పరిస్థితులు ఇంకా మెరుగయ్యే అవకాశం ఉందనే అంచనాతో మేకర్స్‌ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

Also Read: Virat Kohli: అప్పుడు కూడా కెప్టెన్‌లా ఆలోచించా.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..

US Snow Strom: శీతల గాలుల ఎఫెక్ట్.. జీవం ఉన్నా.. జీవశ్ఛవాలుగా మారిన మూగ జీవులు.. అధికారులు పలు సూచనలు..

Budget 2022: అటు ఎన్నికలు.. ఇటు దక్షిణాది రాష్ట్రాల డిమాండ్స్.. కేంద్ర బడ్జెట్ ఎటు వైపు మొగ్గుతుంది?