
ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ శంషాబాద్ విమానాశ్రయంలో ఇబ్బందికి గురయ్యారు. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లోని లిఫ్ట్‌లో ఆయన ఉండగా.. కరెంట్ పోయి ఒక్కసారిగా నిలిచిపోయింది. ఆ సమయంలో ఎగ్జిట్ డోర్ నుంచి బయటకు వెళ్లాలని ప్రయత్నించగా.. ఆ డోర్ చైన్‌తో లాక్ అయ్యింది. అయితే మరికొద్ది సేపు తరువాత లిఫ్ట్ యధాతథంగగా పనిచేయడంతో రితేశ్ సురక్షితంగా బయటకు వచ్చారు.
అనంతరం దీనికి సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రితేష్.. ‘‘హైదరాబాద్ ఎయిర్‌పోర్టులోని లాగ్‌లో ఉన్నా. కరెంట్ పోవడంతో లిఫ్ట్ ఆగిపోయింది. ఉన్న ఒకే ఒక్క ఎగ్జిట్ డోర్‌కు లాక్ వేశారు. ఒకవేళ అగ్నిప్రమాదం జరిగితే ఎగ్జిట్ డోర్ తెరుచుకోకపోతే ఎలా’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అక్కడి సెక్యూరిటీ వారు అక్కడి డోర్‌ను తెరిచేందుకు అనుమతిని ఇవ్వలేదని ఆయన అన్నారు. ‘‘ఎయిర్‌పోర్ట్ అధికారుల్లారా.. ఇప్పుడైనా మేల్కొండి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే దారులకు లాక్ వేయకండి’’ అంటూ రితేష్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
So we were at the Hyderabad Airport Lounge – suddenly the power goes off- the way in & out is an elevator that shuts down. The only exit door is locked in a chain (Incase of FIRE? it’s a tragedy waiting to happen)- pic.twitter.com/jO3TQhVlQG
— Riteish Deshmukh (@Riteishd) May 27, 2019
దీనిపై ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పందించారు. ‘‘చిన్నపాటి సాంకేతిక సమస్య కారణంతో ఈ పరిస్థితి తలెత్తింది. అత్యవసర సమయాల్లో ఎగ్జిట్ డోర్‌ను బద్దలు కొట్టొచ్చు. అక్కడే ఓ బాక్స్‌లో దానికి సంబంధించిన కీ కూడా ఉంటుంది. ఫీడ్ బ్యాక్ ఇచ్చినందుకు రితేష్ దేశ్‌ముఖ్‌కు ధన్యవాదాలు’’ అంటూ తెలిపారు.