Kantara: మరో అరుదైన ఘనత సాధించిన చిన్న సినిమా.. ఆస్కార్ రేస్‌‌లో కాంతార

కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారా సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయ్యి.. అక్కడ సూపర్ హిట్ టాక్ వచ్చిన తర్వాత మిగిలిన పలు భాషల్లో రిలీజ్ అయ్యింది ఈ మూవీ.

Kantara: మరో అరుదైన ఘనత సాధించిన చిన్న సినిమా.. ఆస్కార్ రేస్‌‌లో కాంతార
Kantara

Updated on: Jan 10, 2023 | 12:54 PM

చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాలిసింది కాంతార సినిమా గురించే. కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయ్యి.. అక్కడ సూపర్ హిట్ టాక్ వచ్చిన తర్వాత మిగిలిన పలు భాషల్లో రిలీజ్ అయ్యింది ఈ మూవీ. దాదాపు 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 450కోట్లకు పైగా వసూల్ చేసింది. ఈ సినిమా పై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో 20 నిముషాలు ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోపెడుతుంది.ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న కాంతార మూవీ ఇప్పుడు మరో అరుదైన ఘనతను అందుకుంది. ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచి ఇండియన్ సినిమా లవర్స్ గర్వపడేలా చేసింది.

కాంతార సినిమా ఆస్కార్ కు నామినేట్ అయ్యిందని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. కాంతార సినిమా రెండు విభాగాల్లో ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. బెస్ట్ మూవీ  అవార్డు, బెస్ట్ యాక్టర్ అవార్డులకు గాను కాంతార  సినిమా 95ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.

కన్నడిగులు సంప్రదాయమైన భూతకోల నేపథ్యంలో తెరకెక్కిన కాంతార సినిమాకు రిషబ్ శెట్టినే దర్శకత్వం వహించి నటించారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే ఆలోచనలోనూ ఉన్నారు నిర్మాతలు.

ఇవి కూడా చదవండి