Rhea Chakraborthy call records: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ కేసులో రోజుకో కీలక విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్, నటి రియా కాల్ రికార్డులు మీడియాకు చిక్కాయి. అందులో రియా పలువురితో టచ్‌లో ఉన్నట్లు తేలింది. వారిలో టాలీవుడ్ ప్రముఖులు రానా దగ్గుబాటి, రకుల్ కూడా ఉన్నారు. రానాకు రియా ఏడు సార్లు ఫోన్ చేయగా, రకుల్‌కి 30 సార్లు ఫోన్ చేసింది. ఇక రానా, రియాకు 14 సార్లు ఫోన్ చేయగా.. రకుల్ కూడా 14 సార్లు ఆ నటికి ఫోన్ చేసినట్లు తేలింది. ఇక బాలీవుడ్ ప్రముఖులు ఆమిర్ ఖాన్, ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్, సన్నీ సింగ్, దివంగత సరోజ్ ఖాన్ నంబర్‌లు కూడా రియా కాల్ లిస్ట్‌లో ఉన్నాయి. వారితో ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడు మాట్లాడినట్లు రికార్డుల్లో తెలిసింది. వీరితో కొంతమందితో మెసేజ్‌లు కూడా చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ‘ఏయూ’ అనే పేరుతో రియా పలుమార్లు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ నంబర్ ఎవరిదన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Read This Story Also: ప్రభాస్‌తో కేజీఎఫ్ దర్శకుడు.. మరో క్రేజీ కాంబో షురూ!