Drugs Case: రియా చక్రవర్తికి ఊరట.. బ్యాంకు ఖాతాల పునరుద్ధరణ..

గతేడాది బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో డ్రగ్స్‌కోణం కూడా దాగి ఉండడంతో..

Drugs Case: రియా చక్రవర్తికి ఊరట.. బ్యాంకు ఖాతాల పునరుద్ధరణ..

Updated on: Nov 11, 2021 | 9:29 PM

గతేడాది బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో డ్రగ్స్‌కోణం కూడా దాగి ఉండడంతో సీబీఐతో పాటు ఎన్సీబీ సంయుక్తంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. కాగా సుశాంత్‌ స్నేహితురాలు, బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తి తో పాటు ఆమె సోదరుడు డ్రగ్స్‌ ఆరోపణలపై సెప్టెంబర్‌లో జైలు పాలయ్యాడు. విచారణలో భాగంగా ఎన్సీబీ అధికారులు రియా బ్యాంకు ఖాతాలను పూర్తిగా ఫ్రీజ్‌చేసి తన సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుంది. సుమారు నెల రోజుల పాటు జైలులో గడిపిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత బెయిల్‌పై బయటకు వచ్చింది.

వాటిని విక్రయించద్దు..
ఈ క్రమంలో మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోన్న రియా…తన ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పోషణ నిమిత్తం తన బ్యాంకు ఖాతాలను పునరుద్ధరించాలని న్యాయస్థానాన్ని కోరింది. అదేవిధంగా తన బ్యాంక్‌ అకౌంట్స్‌ని ఫ్రీజ్‌ చేయడం, గాడ్జెట్స్‌ని స్వాధీనం చేసుకోవడంలో ఎన్సీబీ తగిన కారణాలు చూపించలేదని ఆమె కోర్టుకు విన్నవించింది. రియా అభ్యర్థనలు విన్న న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఆమె బ్యాంకు ఖాతాలని పునరుద్ధరించాలని ఆదేశించింది. అదేవిధంగా రూ.లక్ష పూచీకత్తుపై స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌లను తిరిగి ఇచ్చేయాలని పేర్కొంది. అయితే కేసు విచారణ పూర్తయ్యే వరకు సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌లను ఇతరులకు విక్రయించవద్దని తీర్పు వెలువరించింది.

Also Read:

Anchor Vishnu Priya: పెళ్లిపై ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసిన యాంకర్ విష్ణు ప్రియ.. ఇదిగో పోస్ట్..

Keerthy Suresh: అన్నాత్తేకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్న కీర్తి సురేష్..! ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

Mallika Sherawat: పాట కోసం నా నడుముపై చపాతీలు వేడిచేస్తానన్నాడు.. మల్లిక ఆసక్తికర వ్యాఖ్యలు..