Republic Day Celebrations: స్వదేశీ టీకా మనకు గర్వకారణం.. కరోనాతో పోరాడి మృతిచెందిన వారికి బాలకృష్ణ నివాళులు

|

Jan 26, 2021 | 4:41 PM

శం కోసం పోరాడుతూ ఎన్నో త్యాగాలను చేసిన స్వాతంత్య్ర సమరయోధుల స్పూర్తితో సమాజ అభివృద్ధికి పాటుపడాలని సినీ హీరో , హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజలను కోరారు. 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను..

Republic Day Celebrations: స్వదేశీ టీకా మనకు గర్వకారణం.. కరోనాతో పోరాడి మృతిచెందిన వారికి బాలకృష్ణ నివాళులు
Follow us on

Republic Day Celebrations: దేశం కోసం పోరాడుతూ ఎన్నో త్యాగాలను చేసిన స్వాతంత్య్ర సమరయోధుల స్పూర్తితో సమాజ అభివృద్ధికి పాటుపడాలని సినీ హీరో , హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజలను కోరారు. 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఎన్టీఆర్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటు చేశారని తెలిపారు. కరోనా వైరస్ సమయంలో తమ ప్రాణాలను, కుటుంబాలను లెక్కచేయకుండా వైద్యులు అంకితభావంతో నాణ్యమైన సేవలు అందించారని బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. సేవలను అందిస్తూ.. కరోనాతో పోరాడి మృతిచెందిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు బాలకృష్ణ నివాళులర్పించారు. అంతేకాదు.. కరోనా వైరస్ నివారణ కోసం మన దేశంలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ విదేశాల్లోని ప్రజలకు ఉపయోగపడటం గర్వకారణమన్నారు ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అద్భుతంగా సాగుతోందని తెలిపారు బాలకృష్ణ

 

Also Read: ఒక చిన్న అబద్ధంతో ట్విట్టర్ లో మీమ్స్ గా మారిన హాలీవుడ్ స్టార్.. మరి ఆ అబద్ధం ఏమిటో తెలుసా..!