Rebel Star Krishnam Raju: సినిమా ఇండస్ట్రీలో విషాదం.. రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు కన్నుమూత

|

Sep 11, 2022 | 7:41 AM

Rebel Star Krishnam Raju Passes Away: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. రెబల్‌స్టార్‌ కృష్ణం రాజు (83) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన..

Rebel Star Krishnam Raju: సినిమా ఇండస్ట్రీలో విషాదం.. రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు కన్నుమూత
Rebel Star Krishnam Raju
Follow us on

Rebel Star Krishnam Raju Passes Away: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. రెబల్‌స్టార్‌ కృష్ణం రాజు (83) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కృష్ణంరాజు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు.1940, జనవరి20న జన్మించారు. కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు. ఆయన 183 చిత్రాలకుపైగా నటించారు. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఆదివారం తెల్లవారు జామున 3:25గంటలకు మరణించారు.

కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన కృష్ణంరాజు వాజ్‌పేయ్‌ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అలాగే 2004లో లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందిన కృష్ణంరాజు .. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు.1966లో చిలకా గోరింక చిత్రంతో సినీ ఎంట్రీ ఇచ్చారు. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. రెబల్‌స్టార్‌గా కృష్ణంరాజుకు సినీ ఇండస్ట్రీలో మంచి పేరుంది.

హీరోగా సినీ రంగ ప్రవేశం చేసి విలన్‌గానూ అలరించారు. కృష్ణంరాజు కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్‌ను ఏలారు. ఆయన మృతిలో టాలీవుడ్‌ షాక్‌కు గురైంది. సోమవారం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన మృతితో సినీ పరిశ్రమ శోకసముద్రంలో మునిగిపోయింది. 1977,1984లో నంది అవార్డును గెలుచుకున్నారు. 1988లో ‘తాండ్రపాపారాయుడు’ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు.

ఇవి కూడా చదవండి

కృష్ణంరాజు సొంత‌పేరు ఉప్పల‌పాటి వెంక‌ట కృష్ణంరాజు. తెలుగు సినిమా క‌థానాయ‌కుడిగా, నిర్మాత‌గా, రాజ‌కీయ‌వేత్తగా వెలుగు వెలిగిన కృష్ణంరాజు తుదిశ్వాస విడవడం ఇండస్ట్రీలో విషాదంగా మారింది. ఈ విష‌యం తెలియ‌గానే ప్రభాస్ హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు.

మొదటి భార్య సీతాదేవి క‌న్నుమూయ‌డంతో, 1996లో శ్యామ‌లా దేవిని వివాహం చేసుకున్నారు. దాదాపు 183 సినిమాల్లో న‌టించిన అనుభ‌వం కృష్ణంరాజు సొంతం. చిలకా గోరింక అనే చిత్రంతో కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు కృష్ణంరాజు. అమరదీపం, భక్త కన్నప్ప వంటి సొంత చిత్రాలు గొప్ప న‌టుడిగా పేరు తెచ్చిపెట్టాయి

1976లో బాపు దర్శకత్వంలో భక్త కన్నప్ప సినిమాలో కృష్ణం రాజు నటించి తనలోని భక్తి రసాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. శ్రీకాళహస్తి ఆలయ మహాత్మ్యంలోని ముఖ్యమైన భాగమైన కన్నప్ప కథతో తెర‌కెక్కించారు.సాక్షాత్తు శివుడినే మెప్పించగలిగే పరమ భక్తుడి కన్నప్ప పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడా అన్నట్లుగా కృష్ణంరాజు తన నటన నైపుణ్యాన్ని తెరముందు ప్రదర్శించారు.


మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి