
‘2.O’తో అక్షయ్ కుమార్‌ను సౌత్ ఇండస్ట్రీకి తీసుకొచ్చిన కోలీవుడ్ దర్శకుడు శంకర్.. ‘ఇండియన్ 2’తో మరో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌ను తీసుకురావాలని భావించాడు. ఈ మేరకు అతడితో సంప్రదింపులు కూడా జరిపాడు. అయితే విలన్ పాత్రలు చేసేందుకు సిద్ధంగా లేని అజయ్ ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వార్తలు వినిపించాయి. దాంతో యువ నటుడు సిద్ధార్థ్‌ను విలన్‌గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే తాను ఇండియన్ 2లో నటించకపోవడానికి అసలు కారణాన్ని అజయ్ తాజాగా చెప్పుకొచ్చాడు. శంకర్ దర్శకత్వంలో నటించేందుకు తాను ఎంతో ఇష్టాన్ని చూపానని.. అయితే డేట్స్ అడ్జెస్ట్ అవ్వకే ఈ ప్రాజెక్ట్‌లో నటించలేకపోయానని చెప్పాడు. ‘ఇండియన్ 2’ కథను చెప్పిన శంకర్ వెంటనే షూటింగ్‌లో జాయిన్ అవ్వాలని కోరారని.. కానీ ‘తానాజీ ’షూటింగ్‌లో బిజీగా ఉండటం వలనే శంకర్‌కు నో చెప్పానని తెలిపాడు. కాగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ‘ఇండియన్ 2’లో.. కమల్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు.