Sreeleela: శ్రీలీలకు బర్త్‌డే విషెస్‌ చెప్పిన చిత్ర యూనిట్‌.. రవితేజ ‘ధమాకా’ నుంచి కొత్త లుక్‌ విడుదల..

|

Jun 14, 2022 | 5:10 PM

Sreeleela: 'పెళ్లి సందడిD' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అందాల ముద్దుగుమ్మ శ్రీలీల. చేసింది ఒకే సినిమా అయిన పది సినిమాలతో సమానమైన క్రేజ్‌ను దక్కించుకుందీ బ్యూటీ. అందం, అభినయంతో...

Sreeleela: శ్రీలీలకు బర్త్‌డే విషెస్‌ చెప్పిన చిత్ర యూనిట్‌.. రవితేజ ధమాకా నుంచి కొత్త లుక్‌ విడుదల..
Sreeleela Birthday
Follow us on

Sreeleela: ‘పెళ్లి సందడిD’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అందాల ముద్దుగుమ్మ శ్రీలీల. చేసింది ఒకే సినిమా అయిన పది సినిమాలతో సమానమైన క్రేజ్‌ను దక్కించుకుందీ బ్యూటీ. అందం, అభినయంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈ క్యూట్ గర్ల్‌కు వరుస ఆఫర్లు క్యూకట్టాయి. బడా స్టార్‌ల సరసన నటించే అవకాశాలను సొంతం చేసుకుంది. తెలుగులో వచ్చిన క్రేజ్‌తో కన్నడలోనూ ఈ అమ్మడుకి ఆఫర్లు క్యూకట్టాయి. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల పుట్టిన రోజు ఈరోజు (మంగళవారం). ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా ఈ బ్యూటీకి బర్త్‌డే విషెస్‌ వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో శ్రీలీల నటిస్తోన్న తాజా సినిమా ‘ధమాకా’ చిత్ర యూనిట్ శ్రీలాలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. ‘డబుల్‌ ఇంపాక్ట్‌’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఫుల్‌ లెంగ్త్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు కేవలం ఫస్ట్‌ లుక్‌లను మాత్రమే విడుదల చేస్తూ వస్తోన్న చిత్ర యూనిట్ తాజాగా శ్రీలీల బర్త్‌డే రోజు మరో పోస్టర్‌ను విడుదల చేసింది. శ్రీలీలాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ ఓ ట్వీట్ చేసింది. చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ శ్రీలాలకు బర్త్‌డే విషెస్‌ చెబుతూ.. ‘తన ఎనర్జీతో వెండితెరపై అద్భుతాలు చేయడానికి సిద్ధమవుతోన్న ‘చోటా ధమాకా’కు చిత్ర యూనిట్ నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాము’ అంటూ ఓ క్యాప్షన్‌ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే శ్రీలీల చేతిలో ప్రస్తుతం ధమాకాతో పాటు మరో రెండు సినిమాలు ఉన్నాయి. నితిన్-వ‌క్కంతం వంశీ సినిమాలో న‌టిస్తుంది. దీంతో పాటు బాల‌కృష్ణ-అనిల్‌ రావిపూడి చిత్రంలో బాల‌కృష్ణ కూతురు పాత్రలో న‌టిస్తుంది. అంతేకాకుండా మంత్రి గాలిజ‌నార్థన్ రెడ్డి కుమారుడు కిరీటీ డెబ్యూ మూవీలోనూ హీరోయిన్‌గా నటిస్తోందీ బ్యూటీ.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..