Ravi Kishan Shukla: ఎన్నికల వేళ రేసుగుర్రం విలన్‌ ఇంట సవతి పోరు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన నటుడి భార్య

|

Apr 18, 2024 | 11:11 AM

ప్రముఖ నటుడు, ఎంపీ రవి కిషన్ శుక్లా భార్య ప్రీతి శుక్లా మంగళవారం లక్నోలో గోరఖ్‌పూర్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. రవి కిషన్ భార్య అని చెప్పుకుంటోన్న మహిళతో సహా ఆరుగురిపై ఆమె ఫిర్యాదు చేశారు. అపర్ణా ఠాకూర్, ఆమె భర్త రాజేష్ సోనీ, ఆమె కుమార్తె షాల్ షీనోవా సోనీ, ఆమె కుమారుడు సోనాక్ సోనీ, ఎస్పీ అధికార ప్రతినిధి వివేక్ కుమార్ పాండే, జర్నలిస్టు ఖుర్షీద్ ఖాన్ రాజులపై కేసు నమోదైంది..

Ravi Kishan Shukla: ఎన్నికల వేళ రేసుగుర్రం విలన్‌ ఇంట సవతి పోరు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన నటుడి భార్య
Ravi Kishan Shukla
Follow us on

ఛత్తీస్‌గఢ్‌, ఏప్రిల్‌ 18: ప్రముఖ నటుడు, ఎంపీ రవి కిషన్ శుక్లా భార్య ప్రీతి శుక్లా మంగళవారం లక్నోలో గోరఖ్‌పూర్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. రవి కిషన్ భార్య అని చెప్పుకుంటోన్న మహిళతో సహా ఆరుగురిపై ఆమె ఫిర్యాదు చేశారు. అపర్ణా ఠాకూర్, ఆమె భర్త రాజేష్ సోనీ, ఆమె కుమార్తె షాల్ షీనోవా సోనీ, ఆమె కుమారుడు సోనాక్ సోనీ, ఎస్పీ అధికార ప్రతినిధి వివేక్ కుమార్ పాండే, జర్నలిస్టు ఖుర్షీద్ ఖాన్ రాజులపై కేసు నమోదైంది. అపర్ణ నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఆమెకు అండర్ వరల్డ్‌తో సంబంధాలు ఉన్నాయని ప్రీతీ శుక్లా ఫిర్యాదులో పేర్కొన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తన భర్త రవికిషన్‌ను తప్పుడు క్రిమినల్ కేసుల్లో ఇరికిస్తానని, అలా జరగకుండా ఉండాలంటే రూ.20 కోట్లు అపర్ణ డిమండ్‌ చేస్తూ బెదిరిస్తోందని ఆమె ఆరోపించారు.

కాగా ఇటీవల లక్నోలోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అపర్ణ అనే మహిళ రవి కిషన్ తన భర్త అని, తన కుమార్తెకు తండ్రి అని పేర్కొంది. రవికిషన్ తన కూతురి హక్కులను కాలరాస్తున్నాడని ఆమె ఆరోపించింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం లేపింది. అయితే సదరు మహిళ (అపర్ణ) వాదనలను రవికిషన్‌ భార్య ప్రీతి తోసిపుచ్చింది. తన భర్త ప్రతిష్టను దిగజార్చేందుకు, లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఈ కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు. ఈ కుట్రలో ఎస్పీ ప్రతినిధి, మీడియా కోఆర్డినేటర్ వివేక్ కుమార్ పాండే, ఓ ప్రైవేట్ ఛానెల్‌కు చెందిన జర్నలిస్టు ఖుర్షీద్ ఖాన్ రాజు కూడా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.

వారిపై ఐపీసీ సెక్షన్లు 120బి, 195, 386, 388, 504, 506 సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఎంపీ భార్య ఫిర్యాదు మేరకు అపర్ణతో పాటు ఇతర నిందితులపై బెదిరింపులు, దోపిడీ, కుట్ర, ఇతర నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవినా త్యాగి మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.