Rashmika Mandanna Vs Pooja Hegde: పూజా హెగ్డే – రష్మిక మధ్య హోరా హోరీ.. అక్కడ పైచేయి ఎవరిదంటే..?

Rashmika Mandanna Vs Pooja Hegde: నార్త్ ఎంట్రీ విషయంలో రష్మిక కంటే చాలా ముందున్నారు పూజా హెగ్డే. కెరీర్‌ స్టార్టింగ్‌లోనే హృతిక్ లాంటి టాప్ హీరో సరసన ఓ సినిమా చేశారు పూజా.

Rashmika Mandanna Vs Pooja Hegde: పూజా హెగ్డే - రష్మిక మధ్య హోరా హోరీ.. అక్కడ పైచేయి ఎవరిదంటే..?
Pooja Hegde, Rashmika Mandanna

Updated on: Jul 14, 2022 | 11:53 AM

Rashmika Mandanna Vs Pooja Hegde: పూజా హెగ్డే, రష్మిక మందన్న.. ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీస్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌. తెలుగులో గ్యాప్‌ లేకుండా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీస్‌ నార్త్‌ ఇమేజ్‌ విషయంలోనూ హెడ్ టు హెడ్ తలపడుతున్నారు. నార్త్ ఎంట్రీ విషయంలో రష్మిక కంటే చాలా ముందున్నారు పూజా హెగ్డే. కెరీర్‌ స్టార్టింగ్‌లోనే హృతిక్ లాంటి టాప్ హీరో సరసన ఓ సినిమా చేశారు పూజా. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావటంతో తరువాత బాలీవుడ్‌ నుంచి ఈ బ్యూటీకి ఎలాంటి ఆఫర్స్ రాలేదు. దీంతో సౌత్ మీద సీరియస్‌గా కాన్సన్‌ ట్రేట్‌ చేసిన బుట్టబొమ్మ వరుస హిట్స్‌తో టాప్‌ లీగ్‌లోకి చేరారు. అదే జోరులో బాలీవుడ్‌లోనూ రీ ఎంట్రీ ఇచ్చేశారు.

నార్త్ ఇండస్ట్రీకి లేట్‌ గా ఎంట్రీ ఇచ్చినా.. క్రేజీ కాంబినేషన్స్‌తో దూసుకుపోతున్నారు రష్మిక మందన్న. బాలీవుడ్‌లో ఫస్ట్ టైమ్ మిషన్ మజ్ను సినిమా చేశారు క్రష్మిక. ఈ సినిమా రిలీజ్‌ కాకముందే మరో మూడు సినిమాలు ఈ బ్యూటీ కిట్టీలో చేరాయి. ప్రజెంట్‌ అమితాబ్‌తో గుడ్‌ బై, రణబీర్‌తో యానిమల్‌ సినిమాలు చేస్తున్నారు శ్రీవల్లి. టైగర్‌ ష్రాఫ్‌తోనూ ఓ సినిమా సైన్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకపోయినా.. పుష్ప సినిమాతో వచ్చిన క్రేజే.. రష్మికకు నార్త్‌లో వరుస ఆఫర్స్ తెచ్చిపెడుతోంది.

ఇవి కూడా చదవండి

నెంబర్ పరంగా పూజా కన్నా రష్మికనే కాస్త ముందున్నారు. రష్మిక బాలీవుడ్‌లో నాలుగు సినిమాలు చేస్తుంటే… పూజా చేతిలో మాత్రం సర్కస్‌, కబీ ఈద్‌ కబీ దివాళీ సినిమాలే ఉన్నాయి. సౌత్‌లో ఫుల్ ఫామ్‌లోనే ఉన్నా… నార్త్ విషయంలో మాత్రం పూజా రేంజ్‌ కాస్త వెనకబడిందన్న మాటే ఇండస్ట్రీ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. మరి రష్మికకు పోటి ఇచ్చేందుకు పూజా ఎలాంటి స్ట్రాటజీ ప్లే చేస్తారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తలు చదవండి..