AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Macherla Niyojikavargam: రాజప్పగా సముద్రఖని.. మాచర్ల నియోజకవర్గం నుంచి లుక్ అదిరిపోయిందిగా..

సముద్రఖని ఫస్ట్ లుక్ పోస్టర్ ఊహించని లెవల్లో ఉందనే చెప్పాలి. గతంలో ఎప్పుడు కనిపించని లుక్ లో కనిపిస్తున్నారు. ఓల్డెజ్ లుక్ లో నెరిసిన జుట్టు,

Macherla Niyojikavargam: రాజప్పగా సముద్రఖని.. మాచర్ల నియోజకవర్గం నుంచి లుక్ అదిరిపోయిందిగా..
Samuthirakani
Rajitha Chanti
|

Updated on: Jul 14, 2022 | 12:13 PM

Share

యంగ్ హీరో నితిన్ (Nithiin) ప్రస్తుతం నటిస్తోన్న సినిమా మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam). డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఇటీవల విడుదలైన రా.. రా..రెడ్డి సాంగ్ యూట్యూబ్‏ను షేక్ చేస్తోంది. ఇందులో అంజలి నితిన్‏తో మాస్ స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ మూవీ నుంచి విలక్షణ నటుడు సముద్రఖని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆయన రాజప్ప పాత్రలో కనిపించనున్నట్లు లేటేస్ట్ గా విడుదలైన పోస్టర్ ద్వారా తెలియజేశారు మేకర్స్.

సముద్రఖని ఫస్ట్ లుక్ పోస్టర్ ఊహించని లెవల్లో ఉందనే చెప్పాలి. గతంలో ఎప్పుడు కనిపించని లుక్ లో కనిపిస్తున్నారు. ఓల్డెజ్ లుక్ లో నెరిసిన జుట్టు, మీసంతో తెల్లటి కండువతో రాజప్పగా చాలా పవర్‏ఫుల్‏గా కనిపిస్తున్నారు సముద్రఖని. ఇందులో ఆయన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. ఇందులో నితిన్ జోడిగా కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం