
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ ప్రేమ కథ ఉంటుంది. అయితే, దానిని వాళ్లు ఎవరికీ చెప్పరు. చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే రివీల్ చేస్తుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు వాళ్ల ప్రేమ విషయాలను బయటికి చెప్పుకునేందుకు ఇష్టపడరు. కానీ, ఈ స్టార్ హీరో మాత్రం తన లవ్ స్టోరీ ఎక్కడ, ఎలా మొదలైందో చెప్పేశాడు.
బాలీవుడ్‌లో పాపులర్ ప్రేమ జంటల్లో ఒకటి రణ్వీర్ సింగ్-దీపికా పదుకొణె. ఆరేళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట 2018లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2024లో వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన దీపిక బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో రాణిస్తున్న దీపిక, ప్రభాస్ సరసన ‘కల్కి’ సినిమాతో టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది.
అయితే రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె ప్రేమకథ ఎలా మొదలైంది? అనేది ఇప్పటికీ అభిమానులు ఆసక్తిగా వెతుకుతున్న ప్రశ్న. తాజాగా రణ్వీర్ స్వయంగా తమ ప్రేమకథను పంచుకున్నారు. తమ ప్రేమ ఎలా మొదలైంది, ఎవరు మొదటగా ప్రేమను ప్రకటించారు అనే విషయాలను చెప్పుకొచ్చారు.
రణ్వీర్ సింగ్ కంటే ముందు దీపిక పలువురిని ప్రేమించి విఫలమైంది. ఆ బాధను తట్టుకోలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తనే స్వయంగా చెప్పింది. అయితే 2013లో రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె జంటగా ‘రామ్ లీలా’ సినిమాలో నటించారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గుజరాత్లో జరిగే రామ్ లీలా పండుగ నేపథ్యంలో రొమాంటిక్ డ్రామాగా రూపొందింది. రణ్వీర్ రామ్ పాత్రలో, దీపిక లీలా పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా షూటింగ్ టైమ్‌లోనే తమ మధ్య ప్రేమ పుట్టిందని అంటున్నారు రణ్వీర్.
Ranvir And Deepika
ఇటీవల న్యూయార్క్‌లోని యుఎస్ బిలియనీర్ పద్మజా, రామ రాజు మంటెనా కుమార్తె నేత్ర మంటెనా సంగీత్ వివాహ సందర్భంగా రణ్వీర్ తమ ప్రేమకథను పంచుకున్నారు. ‘ఉదయ్‌పూర్ లవ్ స్టోరీలకు లక్ష్మి స్వరూపం! ఇక్కడే ‘రామ్ లీలా’ షూటింగ్ జరిగింది. మీ బాబీతో కలిసి నటించాను. ఆ ఉదయ్‌పూర్ షెడ్యూల్‌లోనే మా ప్రేమకథ మొదలైంది. ఉదయ్‌పూర్ లక్ష్మి స్వరూపం. నాకు లక్షిలాంటి భార్యను ఇచ్చింది’ అంటూ తమ ప్రేమ చిగురించిన రోజులను గుర్తుచేసుకున్నారు రణ్వీర్.
Ranveer: I shot a movie called Ram-Leela in Udaipur. I was starring opposite your bhabhi (Deepika) and it was on the Udaipur schedule where our love story blossomed. Since then, it’s been 13 years of togetherness, 7 years of marriage and one beautiful baby girl ❤️❤️🥰🥰 #deepveer pic.twitter.com/PEghRZa1lp
— DeepVeer Fanclub (@DeepVeer_FC) November 23, 2025
‘రామ్ లీలా’ తర్వాత ‘బాజీరావ్ మస్తానీ’ (2015), ‘పద్మావత్’ (2018) సినిమాల్లోనూ ఇద్దరూ కలిసి నటించారు. ఈ సినిమాలు, భన్సాలీ మ్యాజిక్‌తో వారి కెమిస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా చూపించాయి. 2018 నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. 2024 సెప్టెంబర్‌లో వారికి కుమార్తె దువా పదుకోన్ సింగ్ జన్మించింది. ఈ ఏడాది దీపావళి సందర్భంగా దువా ముఖాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. పెళ్లి తర్వాత కూడా రణ్వీర్, దీపిక ఇద్దరూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూద్దామని అభిమానులూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు!