మరో ప్రాజెక్ట్ లైన్లో పెట్టిన రానా

మరో ప్రాజెక్ట్ లైన్లో పెట్టిన రానా

తెలుగు హీరో రానా స్టైలే వేరు. హీరో అనే ఒక చట్రంలో ఇమిడిపోకుండా పాత్ర నచ్చితే ఎటువంటి క్యారక్టర్ అయినా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు ఈ దగ్గుబాటివారబ్బాయి. ప్రస్తుతం హాలీవుడ్, బాలీవుడ్‌, కోలీవుడ్‌ అంటూ తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ రానా బిజీబిజీగా ఉన్నాడు. ఈ ఆజానుభాహుడు తాజాగా నటించిన ‘యన్‌టిఆర్‌-మహానాయకుడు’ విడుదలకు సిద్దంగా ఉంది. ఇదే కాకుండా హాథీ మేరీ సాథీ, 1945, విరాటపర్వం 1992, లాంటి సినిమాలు కూడా రెడీ చేస్తున్నాడు. […]

Ram Naramaneni

|

Feb 20, 2019 | 3:12 PM

తెలుగు హీరో రానా స్టైలే వేరు. హీరో అనే ఒక చట్రంలో ఇమిడిపోకుండా పాత్ర నచ్చితే ఎటువంటి క్యారక్టర్ అయినా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు ఈ దగ్గుబాటివారబ్బాయి. ప్రస్తుతం హాలీవుడ్, బాలీవుడ్‌, కోలీవుడ్‌ అంటూ తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ రానా బిజీబిజీగా ఉన్నాడు. ఈ ఆజానుభాహుడు తాజాగా నటించిన ‘యన్‌టిఆర్‌-మహానాయకుడు’ విడుదలకు సిద్దంగా ఉంది. ఇదే కాకుండా హాథీ మేరీ సాథీ, 1945, విరాటపర్వం 1992, లాంటి సినిమాలు కూడా రెడీ చేస్తున్నాడు. అనుష్క నటించబోతోన్న సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. ఇంత బిజీ షెడ్యుల్‌లో మరో సినిమాకు రానా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

తమిళంలో సిద్దార్థ్ హీరోగా ‘అవల్'(తెలుగు లో ‘గృహం’) సినిమాను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్న దర్శకుడు మిలింద్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాకు ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమాను విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై గోపీనాథ్ ఆచంట నిర్మించనున్నారు.  ఆగష్టు నుండి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్ననట్లు తెలిపారు. చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu