రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మరో వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు మార్చి 22న విడుదల తేదీని ఖరారు చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది.
ఈ సినిమా విడుదలను ఆపివేయాలంటూ ఎన్నికల కమిషన్‌కు పలు ఫిర్యాదులు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఫిర్యాదులన్నింటిపై విచారణ జరపాలంటూ ఎన్నికల సంఘం రాష్ట్ర హైకోర్టుకు ఆదేశించింది. దానికి సంబంధించిన విచారణలు ఎప్పుడూ పూర్తవుతాయో కూడా తెలీదు. మరోవైపు ఈ మూవీ విడుదలకు వారం రోజుల సమయం లేకపోగా.. ఇంకా సెన్సార్ పూర్తి కూడా కాలేదు. అంతేకాదు మూవీని కొనుగోలు చేసేందుకు బయ్యర్లు కూడా ముందుకు రానట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశాలు లేవని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్‌ను అడ్డుకుంటే యూట్యూబ్‌లో విడుదల చేస్తానంటూ వర్మ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.