రామ్‌గోపాల్ వర్మ ‘Ram Gopal Varma) అంటేనే వివాదాలకు, కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్. ఏ విషయంలోనైనా అందరి కంటే భిన్నంగా ఆలోచించే ఆయన సంచలన కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఎవరికీ భయపడని తత్వం ఆయనది. అందుకే పేరొందిన సెలబ్రిటీలపై సైతం కాంట్రవర్సీ కామెంట్లు చేస్తుంటాడు. ఇక తన లైఫ్‌స్టైల్ విషయంలోనూ ఎంతో ఓపెన్ గా ఉంటారు వర్మ. అందుకే పబ్లిక్‌గా సిగరెట్, మందు తాగడాలు చేస్తుంటాడు. ఆడవాళ్లతో పబ్లిక్‌గా డ్యాన్సులు చేస్తుంటాడు. అందుకే అరియానా, అషూరెడ్డి లాంటి ముద్దుగుమ్మలతో బోల్డ్ ఇంటర్వ్యూలు చేసినప్పుడు ‘అతడికి అమ్మాయిల పిచ్చి ఎక్కువ’ అన్న కామెంట్లు కూడా వినిపించాయి . ఇలా తన మాటలు, చేష్టలతో తన రూటే సపరేట్ అని ముందుకు సాగుతోన్న ఆర్జీవీ బాల్యంలో ఎలా పెరిగాడు? అతని ఆలోచనలు ఎలా ఉండేవి? తదితర ఆసక్తికర విషయాలను పంచుకున్నారు వర్మ సోదరి విజయలక్ష్మి (Vijaya Lakshmi). అవేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి.
9 ఏళ్లకే మాకు షాక్ ఇచ్చాడు..
‘చిన్నప్పటి నుంచి అన్నయ్య(ఆర్జీవీ) అందరికంటే భిన్నంగా ఆలోచించేవాడు. మాతో పాటు ఎవరికీ అర్థమయ్యేవాడు కాదు. తొమ్మిదేళ్ల వయస్సులోనే తన అపార జ్ఞానంతో ఇంట్లో వాళ్లందరినీ ఆశ్చర్యంలోకి నెట్టాడు. ఓసారి మా మామయ్యతో నేను, అన్నయ్య సినిమాకు వెళ్లాం. ఆ మూవీలో ట్రైన్‌ను పేల్చేందుకు కొందరు రైలు పట్టాలపై టైం బాంబ్‌ను ఏర్పాటు చేశారు. కొంత టైం సెట్ చేసి.. ఆ రైలు అక్కడకు రాగానే పేలిపోయేలా ప్లాన్ చేశారు. ఈ సీన్‌ను చూసిన ఆర్జీవీ ‘ అసలు మన దేశంలో ట్రైన్ ఎప్పుడైనా సరైన సమయానికి వస్తుందా? అలాంటప్పుడు ఆ సినిమా దర్శకుడు టైం బాంబును ఎలా సెట్ చేస్తాడు?’ అని అడగడంతో మేమంతా ఆశ్చర్యపోయాం. అలా అప్పటి నుంచే ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకున్నాడు అన్నయ్య. ఏవిషయంలోనైనా ఆయన లాజికల్‌గా థింక్ చేస్తారు.’
అమ్మాయిలతో డ్యాన్స్ లు వేయడం కూలా అలాంటిదే!
‘ఆర్జీవీని అమ్మాయిల పిచ్చోడు అని చాలామంది అంటుంటారు. అందులో ఏ మాత్రం నిజంలేదు. చిన్నప్పుడు అనురాధ అని నా స్నేహితురాలు మా ఇంటికి వచ్చింది. వచ్చిన వెంటనే ఆమెను చూసిన ‘నీ కళ్లు చాలా బావున్నాయి ‘అని అన్నాడు . అన్నయ్య అన్న మాటలకు నేను షాక్‌లోకి వెళ్లిపోయాను. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే నా స్నేహితురాలికి మెల్లకన్ను ఉండేది. ఒకసారి ‘అదెలా నచ్చింది’ అని అన్నయ్యను అడిగాను. దీనికి ‘అస్సలు నేను ఆ అమ్మాయిని కూడా చూడలేదు.. ఏదో ఆ అమ్మాయి సంతోషిస్తుందని ఒక మాట అలా అనేశాను’ అని చెప్పాడు వర్మ. అందుకు తగ్గట్లుగానే ఆ తర్వాత కూడా చాలాసార్లు మీ అన్నయ్య నన్ను పొగిడాడు అని నా స్నేహితురాలు గర్వంగా చెప్పుకునేది. అలా అన్నయ్య అమ్మాయిలను సంతోషపెట్టే మాటలే తప్ప ఏరోజు వారితో తప్పుగా ప్రవర్తించింది లేదు. ఈ మధ్య అమ్మాయిలతో డ్యాన్స్‌లు వేయడం కూడా అలాంటిదే’ అని విజయలక్ష్మి చెప్పుకొచ్చారు.
Also Read:Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో బంధీలుగా భారతీయ విద్యార్థులు.. రష్యా కీలక ప్రకటన
Russia Ukraine war: భారత్‌పై యుద్ధ ప్రభావం.. పెట్రోల్ నుంచి నిత్యావసరాల వరకు పెరగనున్న ధరలు..