Russia Ukraine War: వేగంగా సాగుతున్న ఆపరేషన్ గంగా.. ఉక్రెయిన్‌ నుంచి ఢిల్లీకి చేరుకున్న సీ-17 విమానాలు

IAF Evacuation Flights: ఉక్రెయిన్‌లో (Russia Ukraine War) చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు వేగంగా సాగుతున్నది. ఆపరేషన్‌ గంగలో భాగమైన భారత వాయుసేనకు చెందిన రెండు సీ-17 విమానాలు (C-17 Flights) 420 మందితో ఢిల్లీకి..

Russia Ukraine War: వేగంగా సాగుతున్న ఆపరేషన్ గంగా.. ఉక్రెయిన్‌ నుంచి ఢిల్లీకి చేరుకున్న సీ-17 విమానాలు
C17
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 03, 2022 | 8:20 AM

యుద్ధభూమి ఉక్రెయిన్‌లో (Russia Ukraine War) చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు వేగంగా సాగుతున్నది. ఆపరేషన్‌ గంగలో భాగమైన భారత వాయుసేనకు చెందిన రెండు సీ-17 విమానాలు (C-17 Flights) 420 మందితో ఢిల్లీకి చేరాయి. రొమేనియా రాజధాని బుచారెస్ట్ నుంచి 200 మంది భారతీయులతో భారత వైమానిక దళం(ఐఏఎఫ్​) విమానం.. హిండోన్​ ఎయిర్​ బేస్‌లో దిగింది. ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపులో భాగంగా రొమేనియా రాజధాని బుచారెస్ట్ నుంచి 200 మంది భారతీయులతో భారత వైమానిక దళం(IAF​) విమానం.. హిండోన్​ ఎయిర్​ బేస్‌లో దిగింది. హంగెరీ రాజదాని బుడాపెస్ట్‌ నుంచి 220 మంది భారతీయులతో మరో సీ-17 విమానం ఢిల్లీలోని హిండన్‌ ఎయిర్‌ బేస్‌కి చేరుకున్నాయి. స్వదేశానికి చేరుకున్న భారతీయులకు కేంద్ర మంత్రులు అజయ్‌ భట్‌, రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్వాగతం పలికారు. కాగా, మరో 300 మందితో కూడిన మూడు సీ-17 విమానాలు గురువారం ఉదయం 8 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నాయి.

విమానం.. హిండోన్​ ఎయిర్​ బేస్‌లో దిగింది. సీ-17 మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ తొలి విమానం.. గురువారం తెల్లవారుజామున 1.30లకు ఢిల్లీలో ల్యాండ్ అయింది.

ఉక్రెయిన్​లోని భారత పౌరులను తరలించేందుకు చేపట్టిన ఆపరేషన్​ గంగలో భాగంగా మరో మూడు సీ-17 విమానాల్లో దాదాపు 300 మంది భారత్​కు చేరుకోనున్నారు. ఆ విమానాలు ఉదయం 8 గంటలకు హిండోన్ ఎయిర్‌బేస్‌లో దిగనున్నట్లు సమాచారం.

ఉక్రెయిన్‌లో దాదాపు 8,000 మంది భారతీయులు, ప్రధానంగా విద్యార్థులు చిక్కుకుపోయారని విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వారిని తరలించేందుకు నలుగులు కేంద్ర మంత్రులు ఉక్రెయిన్​ పొరుగు దేశాలకు వెళ్లారు. హంగేరీలో హర్దీప్​సింగ్​ పూరి, రొమేనియాలో జ్యోతిరాదిత్య సింధియా, స్లోవేకియాలో కిరణ్​ రిజిజు, పోలాండ్‌లో వీకే సింగ్ ఉన్నారు.

రష్యా సైనిక దాడి కారణంగా ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ గగనతలం మూసివేసింది. దీంతో ఉక్రెయిన్ పశ్చిమాన ఉన్న రొమేనియా, హంగేరి, పోలాండ్ దేశాల నుంచి భారత్​ ప్రత్యేక విమానాల ద్వారా తన పౌరులను తరలిస్తోంది. ఈ పొరుగు దేశాల నుంచే సీ-17 విమానాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: Russia-Ukraine War: ఫైటింగ్ స్టైయిల్ మార్చిన ఉక్రెయిన్ యువత.. రష్యన్‌ దళాలపై పెట్రోల్‌ బాంబులతో దాడి..