అదేంటి.. చిరు మూవీకి చెర్రీ నిర్మాత కాదా..!

మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ ఆచార్య సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు అందరూ ఊహించారు.

అదేంటి.. చిరు మూవీకి చెర్రీ నిర్మాత కాదా..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 21, 2020 | 2:23 PM

మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ ఆచార్య సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు అందరూ ఊహించారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ మూవీ కోసం కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ ఒక్క రూపాయి కూడా పెట్టడం లేదంట. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ మాత్రమే అంత ఖర్చును భరిస్తుందట. కేవలం రామ్ చరణ్‌ తన బ్యానర్‌ పేరును మాత్రమే ఇస్తున్నారట. ఇందుకోసం ఆయన లాభాల్లో వాటాను తీసుకుంటారట. ఇక చిరంజీవి కూడా రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటాను తీసుకుంటున్నారని తెలుస్తోంది.

కాగా ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో రెమ్యునరేషన్‌ తీసుకునే విధానం మారిపోయింది. ఒకప్పుడు తమకు ఎంత కావాలో డిమాండ్ చేసి నిర్మాతల నుంచి తీసుకునే హీరోలు.. ఇప్పుడు సినిమాలో తాము భాగమై లాభాలను తీసుకుంటున్నారు. శ్రీమంతుడు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు చిత్రాలకు మహేష్‌ బాబు ఇలానే తీసుకుంటున్నట్లు టాక్‌. ఇక కొందరు నిర్మాతలైతే తమ బ్యానర్‌ పేరును ఇస్తూ లాభాలు తీసుకుంటున్నారు. ఆ మధ్యన అల్లు అర్జున్‌ నటించిన అల వైకుంఠపురంలో సినిమా విషయంలో అల్లు అరవింద్ కూడా ఇలానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాను హారిక అండ్ హాసిని సంస్థనే నిర్మించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌ ఇచ్చి అరవింద్ లాభాలను తీసుకున్నారట. ఇక ఇప్పుడు చరణ్‌ కూడా అలానే చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ మూవీలో రామ్ చరణ్‌ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆయనకు సపరేట్‌గా రెమ్యునరేషన్‌ కూడా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. మొత్తానికి కేవలం బ్యానర్ పేరును ఇచ్చి అటు లాభాలు, ఇటు రెమ్యునరేషన్ రెండు చెర్రీ తీసుకుంటున్నారట. కాగా సామాజిక కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో చిరు సరసన మరోసారి కాజల్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే చెర్రీ సరసన రష్మికను తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. వీటిపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Read This Story Also: ప్రధాని ‘జనతా కర్ఫ్యూ’కు టాలీవుడ్ మద్దతు..!

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!