Ram Pothineni : ‘రెడ్’ మూవీ ప్రమోషన్‌‌‌‌లో బిజీగా రామ్.. త్రివిక్రమ్ సినిమాపైన కూడా క్లారిటీ ఇచ్చేసాడు..

యంగ్ హీరో రామ్ నటించిన రెడ్ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 14న  విడుదల చేస్తున్నారు చిత్రయూనిట్.

Ram Pothineni : రెడ్ మూవీ ప్రమోషన్‌‌‌‌లో బిజీగా రామ్.. త్రివిక్రమ్ సినిమాపైన కూడా క్లారిటీ ఇచ్చేసాడు..

Updated on: Jan 11, 2021 | 8:39 PM

Ram Pothineni : యంగ్ హీరో రామ్ నటించిన రెడ్ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 14న విడుదల చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాతో మొదటిసారి రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. తిరుమల కిషొర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్, అమృత అయ్యర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ సూపర్ హిట్ ‘తడమ్’ సినిమా స్టోరీ లైన్ తో ఈ మూవీ తెరకెక్కింది.

ఈ సినిమా తర్వాత రామ్ త్రివిక్రమ్ తో నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం పై రామ్ క్లారిటీ ఇచ్చాడు. ‘రెడ్’ మూవీ ప్రమోషన్ లో భాగంగా రామ్ మాట్లాడుతూ..  త్రివిక్రమ్ తో సినిమా ఇంకా చర్చల దశలోనే ఉంది. ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదని వెల్లడించాడు. అయితే త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి వర్క్ చేయబోతున్నట్లు రామ్ తెలిపాడు.ఇంకా మరికొన్ని కథలను కూడా వింటున్నానని, త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తానని రామ్ అన్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sekhar Kammula : టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.. సినిమా కూడా క‌నెక్ట్ అవుతుంద‌ని హోప్ వ‌చ్చిందన్న శేఖర్ కమ్ముల

Aishwarya Rajesh : ‘డ్రైవర్ జమున’గా మారిన ఐశ్వర్య రాజేష్.. కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసిన బ్యూటీ