‘రాక్షసుడు’ రిలీజ్ డేట్ మార్చుకున్నాడే..!

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘రాక్షసుడు’. ఇది తమిళ హిట్ మూవీ ‘రత్ససన్’కు రీమేక్. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇది ఇలా ఉండగా మొదట ఈ సినిమాను జూలై 18న రిలీజ్ చేయాలనుకున్నారు నిర్మాతలు. అయితే కొన్ని కారణాల వల్ల అది కాస్తా వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఆగష్టు 2న విడుదల […]

  • Ravi Kiran
  • Publish Date - 2:11 am, Wed, 3 July 19
'రాక్షసుడు' రిలీజ్ డేట్ మార్చుకున్నాడే..!

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘రాక్షసుడు’. ఇది తమిళ హిట్ మూవీ ‘రత్ససన్’కు రీమేక్. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇది ఇలా ఉండగా మొదట ఈ సినిమాను జూలై 18న రిలీజ్ చేయాలనుకున్నారు నిర్మాతలు. అయితే కొన్ని కారణాల వల్ల అది కాస్తా వాయిదా పడింది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఆగష్టు 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. హవీష్ ప్రొడక్షన్ బ్యానర్, అభిషేక్ పిక్చర్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.