Coronavirus: కరోనా బారిన పడిన రజనీకాంత్ కూతురు ఐశ్వర్య.. ఆస్పత్రిలో చికిత్స..

Aishwaryaa.. సినిమా పరిశ్రమను కరోనా (Corona virus) నీడలా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే ఎంతోమంది నటీనటులు వైరస్ బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు.

Coronavirus: కరోనా బారిన పడిన రజనీకాంత్ కూతురు ఐశ్వర్య.. ఆస్పత్రిలో చికిత్స..

Updated on: Feb 02, 2022 | 8:53 AM

Aishwaryaa.. సినిమా పరిశ్రమను కరోనా (Corona virus) నీడలా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే ఎంతోమంది నటీనటులు వైరస్ బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) పెద్ద కూతురు, ధనుష్(Dhanush) మాజీ సతీమణి ఐశ్వర్యా  రజనీకాంత్ (Aishwaryaa) కొవిడ్ బాధితుల జాబితాలో చేరిపోయింది.  ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని ఐశ్వర్యే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ‘అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డాను.  ఆస్పత్రిలో చేరాను. దయచేసి అందరూ మాస్కులు ధరించండి. సురక్షితంగా ఉండండి. 2022..ఇంకా నాకోసం ఏమేమి తీసుకొస్తావో చూస్తాను’ అంటూ పోస్ట్ పెట్టింది ఐశ్వర్య. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

త్వరగా కోలుకోవాలి..

కాగా కొన్ని రోజుల క్రితం ధనుష్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అంతకుమందు ధనుష్ సోదరుడు సెల్వరాఘవన్, ఆయన సతీమణి గీతాంజలి కూడా వైరస్ బారిన పడ్డారు. ఇక  మొన్నటివరకు కోలీవుడ్ లో సెలబ్రిటీ కపుల్ గా గుర్తింపు పొందిన ఐశ్వర్య- ధనుష్ గత నెలలో విడాకులు తీసుకున్నారు. అభిమానులు ఈ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. వారు మళ్లీ కలిస్తే బాగుంటుందని ఆకాంక్షిస్తున్నారు.

Also Read:Megastar Chiranjeevi: మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్.. అభిమాని కుటుంబానికి ఏం చేశారో తెలుసా?

Mohammad Azharuddin: ఆరోజు ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు.. హ్యాట్రిక్ సెంచరీల నాటి మధురానుభవాలను గుర్తు చేసుకున్న అజహరుద్దీన్..

Health Tips: నిత్యం ఆ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్‌ టిప్స్‌ మీకోసమే