Rajeev Masand: కరోనాతో పోరాడుతున్న ఫిల్మ్ క్రిటిక్ రాజీవ్ మసంద్.. వెంటిలేటర్‌పై చికిత్స..

|

May 03, 2021 | 7:14 PM

Rajeev Masand hospitalised: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. సాధారణ ప్రజల నుంచి

Rajeev Masand: కరోనాతో పోరాడుతున్న ఫిల్మ్ క్రిటిక్ రాజీవ్ మసంద్.. వెంటిలేటర్‌పై చికిత్స..
Rajiv Masand
Follow us on

Rajeev Masand hospitalised: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమిస్తుండటంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. తాజాగా.. ఇండియన్‌ ఫిల్మ్ క్రిటిక్‌గా పాపులర్‌ అయిన రాజీవ్‌ మసంద్‌ కరోనాతో పోరాడుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. రాజీవ్ మసంద్ కరోనా పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అయితే ఆయనకు ఆక్సిజన్‌ లెవల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు తాజాగా ముంబయిలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్‌పై ఆయనకు ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఆందోళన కరంగానే ఉందని సమాచారం.

దీనిపై ధర్మ ప్రొడక్షన్‌ స్క్రిప్ట్ హెడ్‌ సోమన్‌ మిశ్రా స్పందించారు. ఆయన పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని, కానీ వెంటిలేటర్‌పై ఉన్నారనే వార్తల్లో నిజం లేదని అభిప్రాయపడ్డారు. ఫిల్మ్ క్రిటిక్‌గా, రైటర్‌గా, సీనియర్‌ జర్నలిస్ట్ గా రాజీవ్‌ మసంద్‌ రాణిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో అమీర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ వంటి వారు కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇటు తెలుగులోనూ చాలా మంది స్టార్స్ కరోనాతో పోరాడుతున్నారు. ఈ తరుణంలో కొంతమది తిరిగిరాని లోకాలకు వెళ్లి విషాదాన్ని మిగిల్చారు. ఈ క్రమంలో రాజీవ్ మసంద్ త్వరగా కోలుకోవాలంటూ పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదిక ద్వారా ఆకాంక్షించారు.

Also Read:

కరోనా కోసం సిటి స్కాన్ చేయిస్తున్నారా ? అయితే డేంజర్ అంటున్న ఎయిమ్స్ డైరెక్టర్..

 

అస్సాం ఎన్నికలు, జైల్లో ఉన్నా పోటీ చేసి బీజేపీ అభ్యర్థిపై గెలిచాడు, ప్రచారం చేసిందెవరో మరి ?