‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ కోసం రాజమౌళి స్పెషల్ అరేంజ్‌మెంట్స్..!
ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి లాక్‌డౌన్ నుంచి సడలింపులు రావడంతో ఒక్కొక్కరు సెట్ మీదకు వెళుతున్నారు. ఇక కరోనా నేపథ్యంలో
Rajamouli RRR shooting: ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి లాక్‌డౌన్ నుంచి సడలింపులు రావడంతో ఒక్కొక్కరు సెట్ మీదకు వెళుతున్నారు. ఇక కరోనా నేపథ్యంలో చాలా జాగ్రత్తలే తీసుకుంటూ ఈ షూటింగ్‌లని కానిచ్చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు చిన్న బడ్జెట్ సినిమాలే షూటింగ్‌లను తిరిగి ప్రారంభించగా.. త్వరలోనే భారీ బడ్జెట్ మూవీలు కూడా చిత్రీకరణను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌ని ప్రారంభించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్పెషల్ అరేంజ్‌మెంట్‌లు చేస్తున్నట్లు సమాచారం.
ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించే వారందరినీ అక్టోబర్ 10 నుంచి క్వారంటైన్‌లో ఉంచుతున్నారట. వీరితో సాంకేతిన నిపుణులను సైతం క్వారంటైన్‌లో ఉంచనున్నారట. వీరందరికి టెస్ట్‌లు నిర్వహించి, అందరూ సిద్ధంగా ఉన్నప్పుడు షూటింగ్‌ని ప్రారంభించనున్నారట. అంటే ఈ నెలాఖరులో ఆర్‌ఆర్‌ఆర్ సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఇక షూటింగ్ సమయంలోనూ పలు జాగ్రత్తలను పాటించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రీకరణలో రామ్ చరణ్ ఆలస్యంగా అడుగుపెట్టనున్నారు. చిరంజీవి నటిస్తోన్న ఆచార్యలో కీలక పాత్రలో కనిపించనున్న చెర్రీ.. అక్కడ షూటింగ్‌ని పూర్తి చేసుకొని తరువాత ఆర్‌ఆర్‌ఆర్‌లో తిరిగి పాల్గొననున్నారు.
కాగా ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. వీరి సరసన అలియా, ఒలివియా నటించనున్నారు. అలాగే అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది పాన్ ఇండియాగా విడుదల కానుంది.
Read More:
మరోసారి దాతృత్వం చాటుకున్న ప్రకాష్ రాజ్
సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం.. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్