RRR Movie: ఆర్‌.ఆర్‌.ఆర్‌ కోసం జక్కన్న అంత పెద్ద స్కెచ్‌ వేస్తున్నారా.? ఇదే నిజమైతే భారతీయ సినిమా స్థాయి..

RRR Movie: అపజయం అంటూ ఎరగని దర్శకుడు, ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు రికార్డులు బద్దలవ్వాల్సిందే, అతనే.. దర్శకుడు రాజమౌళి. హీరోలు, అభిమానులు ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటారు...

RRR Movie: ఆర్‌.ఆర్‌.ఆర్‌ కోసం జక్కన్న అంత పెద్ద స్కెచ్‌ వేస్తున్నారా.? ఇదే నిజమైతే భారతీయ సినిమా స్థాయి..
Rrr Movie

Edited By: Ravi Kiran

Updated on: Oct 29, 2021 | 6:25 AM

RRR Movie: అపజయం అంటూ ఎరగని దర్శకుడు, ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు రికార్డులు బద్దలవ్వాల్సిందే, అతనే.. దర్శకుడు రాజమౌళి. హీరోలు, అభిమానులు ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటారు. టాలీవుడ్‌ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత ఈ స్టార్‌ డైరెక్టర్‌ది. ఇంకా చెప్పాలంటే ఇండియన్‌ సినిమాకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చారు. బాహుబలి చిత్రం ఇండియన్‌ సినిమా చరిత్రలోనే ఒక అద్భుతంగా నిలిచింది. భారత్‌లోనే కాకుండా జపాన్‌, చైనాల్లోనూ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న తాజాగా చిత్రం ఆర్‌.ఆర్‌.ఆర్‌ను కూడా అదే స్థాయిలో ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇండియన్‌ సినిమా పరిధిని పెంచిన రాజమౌళి ఈ సినిమా ఇంగ్లిష్‌ వెర్షన్‌ను కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ ప్రొడక్షన్‌ హౌజ్‌లో ఒకటైన వార్నర్‌ బ్రదర్స్‌తో ఇప్పటికే చర్చలు జరిపినట్లు కూడా సమాచారం. ఇదే గనుక నిజమైతే భారతీయ సినిమా స్థాయిని రాజమౌళి మరో మెట్టు పైకెక్కిచ్చినట్లే అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా విషయానికొస్తే రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు నటిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే రాజమౌళి ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. చాలా కాలం పాటు షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. మరి ఈ సినిమా ఇండియన్‌ సినిమా హిస్టరీలో ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Also Read: Google Play Store: ప్లే స్టోర్ నుంచి ప్రమాదకరమైన 150 యాప్స్ ఔట్.. మీ ఫోన్‌లో ఇవి ఉన్నాయో చెక్ చేసుకోండి..

Ind Vs Pak: టీ20 వరల్డ్ కప్ ఫైనల్‎లో భారత్, పాకిస్తాన్ తలపడితే చూడాలని ఉంది.. పాక్ కోచ్ సక్లైన్ ముస్తాక్..

Azim Premji: ప్రతిరోజు రూ.27 కోట్లు విరాళం.. టాప్‌లో ఉన్న మనసున్న మారాజులు వీరే.. #AzimPremji #PremjiDonate