శ్రీముఖికి ఫోన్ చేస్తే.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు

బిగ్‌బాస్ 3 విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, రన్నర్ శ్రీముఖిల మధ్య దూరం మరింత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొన్న ఈ ఇద్దరు హౌస్‌లోకి వెళ్లే ముందు మంచి స్నేహితులు కాగా.. వెళ్లిన తరువాత మాత్రం బద్ధ శత్రువులుగా మారారు. దీంతో బయటికి వెళ్లిన తరువాత తాను రాహుల్‌తో మాట్లాడనని ఒకానొక సందర్భంలో తెగేసి చెప్పింది శ్రీముఖి. అయితే బయటకు వచ్చాక ఈ గొడవలు సద్దుమణుగుతాయని అందరూ అనుకున్నప్పటికీ.. ఇప్పటికీ వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్ […]

శ్రీముఖికి ఫోన్ చేస్తే.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Nov 26, 2019 | 4:24 PM

బిగ్‌బాస్ 3 విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, రన్నర్ శ్రీముఖిల మధ్య దూరం మరింత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొన్న ఈ ఇద్దరు హౌస్‌లోకి వెళ్లే ముందు మంచి స్నేహితులు కాగా.. వెళ్లిన తరువాత మాత్రం బద్ధ శత్రువులుగా మారారు. దీంతో బయటికి వెళ్లిన తరువాత తాను రాహుల్‌తో మాట్లాడనని ఒకానొక సందర్భంలో తెగేసి చెప్పింది శ్రీముఖి. అయితే బయటకు వచ్చాక ఈ గొడవలు సద్దుమణుగుతాయని అందరూ అనుకున్నప్పటికీ.. ఇప్పటికీ వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోంది. వీటికి బలం చేకురుస్తూ తాజాగా శ్రీముఖిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు రాహుల్.

ఈ నెల 29న ఓ లైవ్‌ కన్సర్ట్‌ను ప్లాన్ చేసిన రాహుల్.. ఆ ప్రోగ్రామ్‌ గురించి ఓ సమావేశంలో చెప్పుకొచ్చాడు. దీనికి పలువురు ప్రముఖులు రానున్నారని.. అలాగే బిగ్‌బాస్‌ టీమ్‌ మొత్తాన్ని కూడా ఆహ్వానించానని చెప్పుకొచ్చాడు. అయితే వారిలో ఎవరూ వస్తారన్నది మాత్రం తనకు తెలీదని పేర్కొన్నాడు. ఇక ఇదే సందర్భంలో శ్రీముఖి గురించి ప్రశ్నించగా.. ఆమెకు రెండు రోజుల క్రితం ఫోన్ చేశానని.. కానీ ఆ ఫోన్ ఎవరో వేరే వాళ్లు ఎత్తి షూట్‌లో ఉన్నట్లు చెప్పారని తెలిపాడు. తాను రాహుల్‌ను అని చెప్పినా.. ఇప్పుడు వీడెందుకు ఫోన్ చేశాడు అన్నట్లు వారు ఫోజ్ కొట్టారని అన్నాడు.

ఆ తరువాత తనకు శ్రీముఖి రిటర్న్ కాల్‌ కూడా చేయలేదని.. హౌస్‌లో జరిగిన విషయాలు ఆమె ఇంకా గుర్తు పెట్టుకొని ఉందేమోనని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇక బయటకు వచ్చాక శ్రీముఖి బాగా బిజీగా మారిందని.. తాను ఫోన్ చేసిన సంగతి కూడా గుర్తుందో లేదో అంటూ ఈ సందర్భంగా రాహుల్ సెటైర్లు వేశాడు. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.