AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరు రీయూనియన్ పార్టీలో ఈ స్టార్లు ఎందుకు మిస్సయ్యారు..?

‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ పేరుతో ఎనభైల నాటి తారలంతా ప్రతి సంవత్సరం చేసుకునే వేడుకలు ఈ సారి మెగాస్టార్ చిరంజీవి కొత్త ఇంట్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 40 మంది ప్రముఖులు ఈ పార్టీకి హాజరై.. సందడి చేశారు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్ నుంచి నాగార్జున, వెంకటేష్, మోహన్ లాల్, భాగ్యరాజ్, రమేష్ అరవింద్, ఖుష్బూ, జయరాజ్, లిజీ, సుమన్, భానుచందర్, రాధికా, జయప్రద, జయసుధ, రేవతి, సుహాసిని, అమల, రాధా తదితరులు […]

చిరు రీయూనియన్ పార్టీలో ఈ స్టార్లు ఎందుకు మిస్సయ్యారు..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 26, 2019 | 3:51 PM

Share

‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ పేరుతో ఎనభైల నాటి తారలంతా ప్రతి సంవత్సరం చేసుకునే వేడుకలు ఈ సారి మెగాస్టార్ చిరంజీవి కొత్త ఇంట్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 40 మంది ప్రముఖులు ఈ పార్టీకి హాజరై.. సందడి చేశారు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్ నుంచి నాగార్జున, వెంకటేష్, మోహన్ లాల్, భాగ్యరాజ్, రమేష్ అరవింద్, ఖుష్బూ, జయరాజ్, లిజీ, సుమన్, భానుచందర్, రాధికా, జయప్రద, జయసుధ, రేవతి, సుహాసిని, అమల, రాధా తదితరులు ఈ పార్టీలో పాల్గొన్నారు. అంతేకాదు బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్‌ కూడా ఈ వేడుకల్లో సందడి చేశారు. ఇక విలక్షణ నటుడు జగపతి బాబు కూడా మొదటిసారి ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు. అయితే ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ దూరంగా ఉన్నారు. ఆయనతో పాటు రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్, మమ్ముట్టి, రమ్యకృష్ణ. సత్యరాజ్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, రాజశేఖర్ దంపతులతో పాటు పలువురు స్టార్ నటీనటులు కూడా హాజరుకాలేదు.

బాలయ్య ప్రస్తుతం ‘రూలర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వలనే ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. ఇక రజనీకాంత్ కూడా వేరే పనుల్లో ఉండటం వలనే రాలేదని తెలుస్తోంది. అలాగే సత్యరాజ్, రమ్యకృష్ణ, అర్జున్ వంటి స్టార్ నటులు కూడా సినిమాలతో బిజీగా ఉండటం ఈ గెట్ టు గెదర్‌కు హాజరుకాలేదని సమాచారం. ఇదిలా ఉంటే మరోవైపు కమల్, మమ్ముట్టి, ప్రకాష్ రాజ్, మోహన్‌ బాబు, రాజశేఖర్ దంపతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాకపోగా.. వీరందరూ ఇప్పటివరకు ఒక్క ‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌’లో కూడా పాల్గొనకపోవడం గమనించదగ్గ విషయం. అయితే వీరందరూ మెగాస్టార్‌కు సన్నిహితంగా ఉన్న వారే కాగా.. ఈ ఏడాది వీరిని చిరంజీవి పిలవలేదా..? లేక వారే రాలేదా..? అన్న ప్రశ్నలు కొందరిలో తలెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ రీయూనియన్‌పై కోలీవుడ్ నటుడు, దర్శకుడు ప్రతాప్ పొతిన్ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేశాడు. ‘‘80లలో ఉన్న నటీనటుల్లో నేను అంత మంచి నటుడిని, దర్శకుడిని కాకపోయి ఉండొచ్చు. అందుకే నన్ను వాళ్లు గెట్ టు గెదర్‌కు పిలవలేదేమో’’ అంటూ ఆయన ట్వీట్ చేశాడు.