Tollywood : 75 ఏళ్ల బామ్మగా మారిపోయిన సీనియర్ హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ బ్లాక్ బస్టర్ హిట్స్.. రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండ్..
దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న స్టార్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు తమ నటనతో ప్రేక్షకులను అలరించిన తారలు ఇప్పటికీ సినిమాల్లో బిజీగా ఉన్నారు. మరికొందరు రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. అయితే ప్రస్తుతం ఓ సీనియర్ హీరోయిన్ లేటేస్ట్ ఫోటోస్ చూసి అడియన్స్ షాకవుతున్నారు. తాజాగా ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాదని చాలా మంది తారలు నిరూపించారు. వైవిధ్యభరిత కథ చిత్రాలను ఎంచుకుంటూ నటీమణులుగా మంచి ప్రశంసలు అందుకుంటున్నారు పలువురు హీరోయిన్స్. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు.. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ సక్సెస్ అవుతున్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ సైతం ఒకప్పుడు తోపు హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న ఆమె.. ఇప్పుడు సరికొత్త ప్రయత్నం చేస్తుంది. తన కొత్త ప్రాజెక్టులో 75 ఏళ్ల బామ్మ పాత్రలో కనిపించనుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టారా.. ?
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తన ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న కొత్త సినిమా తాయ్ కిళవి. ఈసినిమాకు కొత్త దర్శకుడు శివకుమార్ మురుగేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో హీరోయిన్ రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రిలీజ్ చేయగా.. రాధిక శరత్ కుమార్ లుక్స్ చూసి అవాక్కవుతున్నారు అడియన్స్. ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించిన రాధిక.. ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి వినూత్న ప్రయత్నం చేస్తుంది.
View this post on Instagram
ఉసిలంపట్టి గ్రామం కట్టుబాటులో నివసించే 75 ఏళ్ల బామ్మగా ఆమె కనిపించనున్నారు. ఆమె కుటుంబం, ఆ ఊరి ప్రజల జీవన విధానం, కట్టుబాట్లు, సమస్యలు, తదితర అంశాలను ప్రధానంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించినట్లు ఇదివరకే చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న రిలీజ్ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి : Actor: ఒక్క సినిమాతోనే అమ్మాయిల డ్రీమ్ బాయ్‌గా.. వరుస హిట్లకు కేరాఫ్ అడ్రస్ ఈ హీరో.. క్రేజ్ చూస్తే..
ఇవి కూడా చదవండి : Actress Srilakshmi : 500లకు పైగా సినిమాలు.. ఈ నటి మేనకోడలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. 300 కోట్లు కొల్లగొట్టింది..
