AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam : ప్రేమికుల దినోత్సవం రోజున ప్రభాస్ సినిమా టీజర్..?.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..

దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా రాధేశ్యామ్ ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యిందని తెలుస్తుంది

Radhe Shyam : ప్రేమికుల దినోత్సవం రోజున ప్రభాస్ సినిమా టీజర్..?.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..
Rajeev Rayala
|

Updated on: Jan 31, 2021 | 8:43 AM

Share

Radhe Shyam : దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘రాధేశ్యామ్’. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యిందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. రాధేశ్యామ్ లో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్ లు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక ఈ మూవీ టీజర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

తాజాగా రాధేశ్యామ్ సినిమా టీజర్ రిలీజ్ డేట్ కోసం సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ టీజర్ ను ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న విడుదల చేయాలనీ చూస్తున్నారట. టీజర్‌తోనే సినిమా రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ ప్రేమకథను గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

శరవేగంగా అల్లు అర్జున్ మూవీ షూటింగ్.. ప్రీరిలీజ్ ముందే భారీ ధరకు పుష్ప నైజాం హక్కులు..?