
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనతో వర్క్ చేసిన లేడీ కొరియోగ్రాఫర్ ను జానీ మాస్టర్ తనని ఎన్నో ఏళ్ల నుంచి వేధిస్తున్నాడు అని కేసు వేసి సంచలనం రేపింది. జానీ మాస్టర్ అన్ని భాషల సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా పనిచేయడంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీల్లో చర్చకు దారి తీసింది.
ఇదిలా ఉంటే యువతి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు జానీ మాస్టర్‌ను గోవాలో అదుపుతీసుకున్నారు. ప్రస్తుతం జానీ మాస్టర్‌కు కోర్టు 14 రోజుల రిమైండ్ విధించింది. ఇదిలా ఉంటే ఈ వ్యహారానికి అల్లు అర్జున్ కారణం అంటూ కొందరు కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి వార్తలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై తాజాగా పుష్ప2 నిర్మాత మైత్రి రవి స్పందించారు.
జానీ మాస్టర్ వివాదంలో అల్లు అర్జున్ ఉన్నాడన్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్న మైత్రి రవి వాటిని ఖండించారు. జానీ మాస్టర్ లేడీ డాన్సర్ వివాదం పూర్తిగా వాళ్ళిద్దరి మద్య జరిగిన పర్సనల్ ఇష్యూ అని తేల్చి చెప్పారు. పుష్ప 2 సినిమా స్టార్టింగ్ నుంచి అన్ని పాటలకు అడిషనల్ కొరియోగ్రఫర్ గా ఆ లేడీ డాన్సర్‌ను నియమించుకున్నామన్న మైత్రి రవి.. ఆరు నెలల క్రితం రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్ లో కూడా ఆ డాన్సర్ పేరు ఉందని చెప్పుకొచ్చారు.
అయితే తాజాగా జానీ మాస్టర్‌తో రెండురోజుల్లో ఒక స్పెషల్ సాంగ్ చేద్దామనుకునే లోపు ఈ ఇస్యూ తెరపైకి వచ్చిందన్నారు. ఈ విషయాలు ఏవీ అల్లు అర్జున్‌కి తెలియదు, అసలు సెట్టస్ వెనకాల ఏమీ జరుగుతుందనేది అల్లు అర్జున్‌కి తెలిసే అవకాశాలు ఉండవని అన్నారు. గొప్ప స్టేచర్ ఉన్న అల్లు అర్జున్‌పై కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళ ఉనికి కోసం ఇలా అలజడి సృష్టిస్తున్నాయని, జానీ మాస్టర్ ఆ లేడీ డాన్సర్ మధ్య వివాదం పూర్తిగా వాళ్ళ పర్సనల్ అని తేల్చి చెప్పారు. మరి దీంతో అయినా ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..