హార్రర్ కథాంశంలో హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న ‘సిరివెన్నెల’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. తాజాగా.. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ లాంచ్ చేశారు. ఆసక్తిని రేకెత్తించేలా ఈ సినిమా ఫస్ట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటుంది. అలాగే.. ప్రియమణి చిన్నప్పటి పాత్రలో బేబీ సాయితేజస్వి నటిస్తోంది. మహానటి సినిమాలో చిన్నప్పటి సావిత్రిగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నారి ఈ సినిమాలో వైవిధ్యభరితమైన నటనను ప్రదర్శించనుంది. కాగా.. ప్రకాశ్ పులిజాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ బోరా, ఏ.ఎన్ భాషా, ఏ రామసీతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.