PM Modi: తెలుగు సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. పీఎం మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Feb 05, 2022 | 9:54 PM

PM Modi: శనివారం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ యాత్ర బిజీ బిజీగా గడిసింది. మొదట పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని, ఆ తర్వాత శంషాబాద్‌లోచి ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన..

PM Modi: తెలుగు సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. పీఎం మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
Follow us on

PM Modi: శనివారం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ యాత్ర బిజీ బిజీగా గడిసింది. మొదట పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని, ఆ తర్వాత శంషాబాద్‌లోచి ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన 216 అడుగుల శ్రీరామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అనంతరం ప్రజలను ఉద్దేశించిన మాట్లాడిన మోడీ రామానుజాచార్యుల గొప్పతనాన్ని వివరించారు. ఈ క్రమంలోనే మోదీ తన ప్రసంగంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి కూడా ప్రస్తావించారు.

తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని గడించిందన్న మోదీ, సిల్వర్‌ స్క్రీన్‌ నుంచి ఓటీటీ వరకు తెలుగు సినిమాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. ఇక తెలుగు భాషపై ప్రశంసలు కురిపించిన మోదీ.. తెలుగు భాష చరిత్ర ఎంతో సుసంపన్నమైందన్నారు. తెలుగు సినిమా సిల్వర్‌ స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తోందని చెప్పుకొచ్చారు.

కాకతీయుల రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం గర్వకారణమన్న మోదీ.. పోచంపల్లి చేనేత వస్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించాయని తెలిపారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను దర్శకుడు హరీష్‌ శంకర్‌ ట్వీట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: Digital TOP 9 NEWS: ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర మంచు | జిల్లా కేంద్రం కోసం బాలకృష్ణ డిమాండ్.. వీడియో

మన్మోహన్ సింగ్ సంతకంతో ఉన్న 2 రూపాయల నోటు లక్షలు సంపాదిస్తుంది.. ప్రత్యేకత ఏంటంటే..?

Viral Video: గుడ్ల కోసం గూట్లోకి దూరిన పాము.. పట్టపగలే చుక్కలు చూపించిన పిట్టలు.. షాకింగ్ వీడియో..