Anchor Pradeep: యాంకర్ ప్రదీప్ సినిమా వచ్చేస్తుంది.. రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసిన చిత్రబృందం..
ఇప్పటివరకు తన మాటలతో బుల్లితెరపై నవ్వులు పూయిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యాంకర్ ప్రదీప్. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న పాత్రలు పోషించాడు.
ఇప్పటివరకు తన మాటలతో బుల్లితెరపై నవ్వులు పూయిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యాంకర్ ప్రదీప్. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న పాత్రలు పోషించాడు. అనంతరం ప్రదీప్ హీరోగా నటించిన చిత్ర 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఇందులో ప్రదీప్‌కు జోడీగా అమృతా అయ్యార్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమాలో వచ్చిన నీలి నీలి ఆకాసం ఇద్దామనుకున్నా సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిన సంగతే. అయితే ఈ సినిమాను గతేడాదే విడుదల చేయాలనుకున్న కరోనా ప్రభావంతో వాయిదా పడింది.
ఇక ప్రదీప్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. జనవరి 29న ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Also Read: అభిమానికి దిమ్మతిరిగే సమాధానం చెప్పిన యాంకర్ సుమ.. దీంతో అతడికి ఏం చేయాలో తెలియక..
‘నిన్ను మిస్ అవుతున్నా’.. సుదీర్‌పై ఆ టాప్ యాంకర్ ఆసక్తికర కామెంట్స్.. వైరల్‌గా మారిన వీడియో..