సినీ ఇండస్ట్రీలో అటు కొరియోగ్రాఫర్గానూ, ఇటు నటుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభుదేవా. అంతేకాకుండా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ దర్శకుడిగా తన సత్తా చాటుకుంటున్నాడు. అయితే తాజాగా పలు సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పాడు. ఇక ఈ ఏడాదిలో ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ‘రాధే’ చిత్రం విడుదలకానుంది. దాదాపు ఈ చిత్రం 230 కోట్ల బిజినెస్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇక తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విక్రమ్ సినిమాలో ప్రభుదేవా కీలక పాత్రలో నటిస్తునున్నాడు. ఇక మంజా పై రాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో కూడా నటించబోతున్నట్లుగా సమాచారం. ఇక మరో యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడట. ఇవే కాకుండా స్వీయ దర్శకత్వంలో మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి ప్రభుదేవా ప్రయాత్నాలు చేస్తున్నాడట.