యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ భారీ చిత్రాలే. రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-కే .. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే. త్వరలోనే రాధేశ్యామ్ (Radheshyam) వంటి పిరియాడికల్ లవ్‌స్టోరీతో మన ముందుకు వస్తున్నాడు డార్లింగ్. ఆ తర్వాత ఆది పురుష్ (AdiPurush) తో తన పాన్ ఇండియా జోరును కొనసాగించాలనుకున్నాడు. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా.. సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాధాన్యత వున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఈ సినిమా ప్రారంభం రోజునే విడుదల తేదీని కూడా ఫిక్స్ చేశారు దర్శక నిర్మాతలు. 2022 ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ డేట్‌ను మార్చారు.
కాగా ఆమీర్ ఖాన్, నాగచైతన్య నటిస్తోన్న లాల్ సింగ్ చద్దా ( Laal singh Chaddha ) సినిమా విడుదల తేదీని మార్చడంతో ఆ ప్రభావం ఆదిపురుష్‌పై పడింది. లాల్ సింగ్ చద్ధా సినిమా నిజానికి ఏప్రిల్ 14న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావంతో సినిమా చిత్రీకరణ సకాలంలో జరగలేదు. దీంతో ముందు అనుకున్న తేదీకి సినిమాను విడుదల చేయలేకపోతున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదే క్రమంలో కొత్త రిలీజ్ డేట్‌ను కూడా విడుదల చేసింది. ఆదిపురుష్ ముందే రిజర్వ్ చేసుకున్న ఆగస్టు 11నే తమ లాల్ సింగ్ చద్ధా సినిమాను రిలీజ్ చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. కాగా ఆదిపురుష్ చిత్ర బృందంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ డేట్‌ను ఫిక్స్ చేసుకున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే ఆదిపురుష్ చిత్ర బృందానికి కృతజ్ఞతలు చెబుతూ లాల్ సింగ్ చద్దా ఓ ఎమోషనల్ నోట్ విడుదల చేసింది. కాగా ఆదిపురుష్ వాయిదాపై ప్రభాస్ అభిమానులు కొందరు కాస్త అసంతృప్తిని వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు డార్లింగ్ ఎప్పుడు వచ్చినా రికార్డులు బ్రేకవుతాయి అంటూ ట్వీట్లతో హంగామా చేస్తున్నారు. ఈక్రమంలో ప్రస్తుతం ఆదిపురుష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. మరోవైపు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
#LaalSinghChaddha @Viacom18Studios @TSeries pic.twitter.com/dZBVkNiIyc
— Aamir Khan Productions (@AKPPL_Official) February 15, 2022
Also Read:Chittoor: చిత్తూరు జిల్లాలో దారుణం.. పాడి ఆవు నోట్లో పేలిన నాటుబాంబు..