Prabhas: ఎట్టకేలకు ఆ రూమర్స్‏కు ఫుల్ స్టాప్ పెట్టిన ప్రభాస్, ప్రశాంత్ నీల్.. అసలేం జరిగిందంటే..

గతంలో 'సలార్' సినిమా కూడా ప్రభాస్ హిట్టిచ్చింది. అయితే 'సలార్ 2' సినిమాపై చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు. ఈ సినిమా ఎప్పటికీ రాదని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ రూమర్స్ కు ప్రభాస్ , ప్రశాంత్ లు ఫుల్ స్టాప్ పెట్టారు. కొన్ని రోజులుగా సలార్ 2 సినిమా గురించి అనేక వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

Prabhas: ఎట్టకేలకు ఆ రూమర్స్‏కు ఫుల్ స్టాప్ పెట్టిన ప్రభాస్, ప్రశాంత్ నీల్.. అసలేం జరిగిందంటే..
Prabhas, Prashanth Neel
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 18, 2024 | 10:44 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. అయితే ‘బాహుబలి 2’ సినిమా తర్వాత డార్లింగ్ నటించిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. కానీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ సినిమా విజయం ప్రభాస్ అభిమానులకు మళ్లీ ప్రాణం పోసింది. గతంలో ‘సలార్’ సినిమా కూడా ప్రభాస్ హిట్టిచ్చింది. అయితే ‘సలార్ 2’ సినిమాపై చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు. ఈ సినిమా ఎప్పటికీ రాదని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ రూమర్స్ కు ప్రభాస్ , ప్రశాంత్ లు ఫుల్ స్టాప్ పెట్టారు. కొన్ని రోజులుగా సలార్ 2 సినిమా గురించి అనేక వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్, ప్రశాంత్ నీల్ మధ్య మనస్పర్థలు వచ్చాయని.. సలార్ సినిమా ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో సలార్ 2 సినిమాకు బ్రేక్ పడిందని.. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు వినిపించాయి. మరోవైపు ప్రభాస్ తన కొత్త సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అలాగే ప్రశాంత్ నీల్ కూడా తన నెక్ట్స్ ప్రాజెక్టు ఎన్టీఆర్ తో చేయనున్నట్లు టాక్ నడిచింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ తన కొత్త సినిమాను తారక్ తో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అవన్నీ అవాస్తవమని తేలింది. దాంతో ‘సలార్ 2’ సినిమాపై అంచనాలు పెరిగాయి.

ప్రభాస్ నటించనున్న ‘ఫౌజీ’ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ హను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ముహూర్త కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్‌ని కూడా ఆహ్వానించారు. ముహూర్తపు కార్యక్రమంలో ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగా మాట్లాడి నవ్వుకున్నారు. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్, ప్రశాంత్ సన్నిహితంగా ఉన్న చిత్రాలను షేర్ చేస్తున్న నెటిజన్లు ‘సలార్ 2’ ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ‘రాజా డీలక్స్’ అనే హారర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ నటించనున్నాడు. ఆ తర్వాత ‘ఫౌజీ’ సినిమాలో నటించనున్నాడు. ఈ మూడు సినిమాల తర్వాత ప్రభాస్ ‘సలార్ 2’ సినిమాలో నటించనున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం