Matthew Perry: నటుడు మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో ట్విస్టులు.. వెలుగులోని సంచలన విషయాలు..

కెటమిన్‌ క్వీన్‌గా పేరుగాంచిన జస్విన్‌ సప్లై చేసిన కెటమిన్‌ కారణంగానే పెర్రీ చనిపోయారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇంతకీ కెటమిన్‌ క్వీన్‌ జస్విన్‌ సంఘా ఎవరు? గతేడాది అక్టోబర్‌ 28న చనిపోయిన ప్రముఖ నటుడు మ్యాథ్యూ పెర్రీ మృతికేసులో దాదాపు పది నెలల తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెర్రీ హత్య జరిగిన దాదాపు పది నెలల తర్వాత జస్విన్ సంఘా అనే మహిళను

Matthew Perry: నటుడు మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో ట్విస్టులు.. వెలుగులోని సంచలన విషయాలు..
Matthew Perry
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Aug 19, 2024 | 10:30 PM

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో అరెస్టైన డ్రగ్‌ డీలర్‌ జస్విన్‌ సంఘా గురించి అనూహ్య విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కెటమిన్‌ క్వీన్‌గా పేరుగాంచిన జస్విన్‌ సప్లై చేసిన కెటమిన్‌ కారణంగానే పెర్రీ చనిపోయారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇంతకీ కెటమిన్‌ క్వీన్‌ జస్విన్‌ సంఘా ఎవరు? గతేడాది అక్టోబర్‌ 28న చనిపోయిన ప్రముఖ నటుడు మ్యాథ్యూ పెర్రీ మృతికేసులో దాదాపు పది నెలల తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెర్రీ హత్య జరిగిన దాదాపు పది నెలల తర్వాత జస్విన్ సంఘా అనే మహిళను అమెరికా పోలీసులు అరెస్టు చేయడం కలకలం సృష్టిస్తోంది. అమెరికా, బ్రిటన్‌ ద్వంద్వ పౌరసత్వం ఉన్న జస్విన్‌, మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు డాక్టర్లు కావడం విశేషం. జస్విన్‌ సంఘాకు కెటమిన్‌ క్వీన్‌ ఆఫ్‌ లాస్‌ ఎంజిలస్‌ అనే పేరుంది. ఆమెను అమెరికా న్యాయవాదులు సెలబ్రిటీ డ్రగ్‌ డీలర్‌ అని వర్ణిస్తారు. హై-ప్రొఫైల్‌ క్లైంట్స్‌కు హై-క్వాలిటీ గూడ్స్‌ సప్లై చేస్తానని గర్వంగా చెప్పుకుంటారు జస్వీన్‌. హాలీవుడ్‌లోని ఆమె నివాసం ఒక డ్రగ్స్‌ ఎంపోరియం అని చెప్పవచ్చు. కెటమిన్‌తో పాటు మెథాంపెటామిన్‌, కొకైన్‌, జానాక్స్‌ వంటి మాదకద్రవ్యాల సరఫరాదారు జస్వీన్‌. మార్చిలో ఆమె ఇంటిపై నిర్వహించిన దాడిలో పోలీసులు 79 బాటిళ్ల లిక్విడ్‌ కెటమిన్‌, 2వేల మెథాంపెటామిన్‌ స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు కాని ఆ తర్వాత లక్ష డాలర్ల బాండ్‌తో ఆమెకు బెయిల్‌ ఇచ్చారు.

విలాసవంతమైన జీవితం గడిపే జస్విన్‌ 2019 నుంచి డ్రగ్స్‌ సరఫరా వ్యాపారం చేస్తున్నారు. కలలో కూడా ఊహించ సాధ్యం కాని అత్యంత విలాసవంతమైన జీవితాన్ని ఆమె గడుపుతారు. మెక్సికో, స్పెయిన్‌, గ్రీస్‌, ఇటలీ, జపాన్‌, ఫ్రాన్స్‌, దుబాయ్‌ వంటి దేశాల్లోని అత్యంత ఖరీదైన ప్రాంతాలను తరచూ సందర్శించడం జస్విన్‌ అలవాటు. జెట్ విమానాల్లోనే ఆమె ప్రయాణం చేస్తారు. ఎక్కడికి వెళ్లినా అతి విలాసవంతమైన డిజైనర్‌ దుస్తులు ధరించడం ఆమె మరో ప్రత్యేకత. అత్యంత ఖరీదైన లూయిస్‌ విటాన్‌ షూస్‌, ఛానెల్‌ బ్రాండ్‌ దుస్తులు ధరించడం, వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడం జస్వీన్‌కు అలవాటు. హాలీవుడ్‌ నటుడు మాథ్యు పెర్రీ కేసులో ఆమె పేరు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నా ఆమె మాత్రం వాటిని పట్టించుకోకుండా తన సోషల్‌ లైఫ్‌, కేర్‌ ఫ్రీ యాటిట్యూడ్‌ కొనసాగిస్తున్నారు.

మ్యాథ్యూ పెర్రి చనిపోవడానికి రెండు వారాల ముందు అతని వ్యక్తిగత సహాయకుడికి 50 వయల్స్ కెటమిన్‌ను జస్విన్‌ అమ్మినట్టు తెలుస్తోంది. వీటి విలువ సుమారు 11వేల డాలర్లు. అనారోగ్యం కోసం కెటమిన్ థెరపీని మ్యాథ్యు పెర్రీ తీసుకుంటున్నారు. దాన్ని ఆసరాగా తీసుకొని అతనికి ఓవర్‌ డోస్‌ అందించినట్టు తెలుస్తోంది. నొప్పి నివారణ, డిప్రెషన్‌ కోసం కెటమిన్‌ను ఉపయోగిస్తారు. దీనికి అమెరికాలో కూడా ఔషధంగా ఉపయోగించేందుకు అనుమతి లేదు. ఇది ఒకలాంటి భ్రాంతికి గురిచేస్తుంది, దృష్టీ మందగిస్తుంది. అమెరికా టెలివిజన్‌లో అత్యంత పాపులర్‌ సిరీస్‌గా నిలిచిన ఫ్రెండ్స్‌లో మ్యాథ్యూ పెర్రీ నటించారు. జస్విన్‌ సంఘాకు గతంలో ఇచ్చిన బెయిల్‌ను అమెరికా కోర్టు రద్దు చేసింది. ఈ కేసు విచారణను అక్టోబర్‌ 15కు న్యాయస్థానం వాయిదా వేసింది. ఆమె మీద అక్కడి పోలీసులు చాలా అభియోగాలు మోపారు. చూడాలి, మరి ఈ సెలబ్రిటీ కెటమిన్‌ క్వీన్‌ ఎలా బయటకు వస్తారో?

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!